Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్ ఘటన బాగా కృంగతీసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పోలీస్ స్టేషన్ మెట్లు కూడా అల్లు అర్జున్ ఎక్కాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ విషయం కాస్త సద్దుమణిగింది అనే లోపు మరో వివాదంలో అల్లు అర్జున్ చిక్కుకున్నారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు.. ‘కిస్సిక్’ భామ శ్రీలీల కూడా ఈసారి అతనితో పాటు కాంట్రవర్సీలో కూరుకుపోయింది. ‘పుష్ప 2’ ప్రీమియర్ (Pushpa 2 Premiere) నిమిత్తం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడంతో పాటు, ఆమె కుమారుడు ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఈ మధ్య ఆ పిల్లాడు కాస్త కోలుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
Also Read- Mahesh Babu: హీరో మహేష్ బాబుకు బిగ్ షాక్.. నెక్స్ట్ లిస్ట్ పెద్దదేనా? ఈడీ వెరీ స్పీడ్ బాస్..
ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదవడం, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్‌పై బయటికి రావడం ఇవన్నీ తెలిసిన విషయాలే. ఈ ఘటనని పోలీసులు, సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్లకు, ఎక్స్‌ట్రా షోలకు అనుమతి లేకుండా చేశారు. అలాగే ఈ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడం, పిల్లాడు హాస్పిటల్‌లో ఉండటంతో.. అల్లు అర్జున్ కూడా బాగా డిస్టర్బ్ అయ్యారు. అందుకే ‘పుష్ప 2’ సక్సెస్‌ని కూడా ఆయన ఎంజాయ్ చేయలేకపోయారు. అసలు కొంతకాలం బయటికి కూడా రాలేదు. అవన్నీ మరిచిపోయి, ఈ మధ్య మళ్లీ ఆయన కాస్త యాక్టివ్ అయ్యారు.
రీసెంట్‌గానే ‘పుష్ప 2’ తర్వాత చేయబోయే సినిమా అప్డేట్ వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో అల్లు అర్జున్ ఓ ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు. అలా అప్డేట్ వచ్చిందో, లేదో.. ఇప్పుడు మళ్లీ ఆయనకు మరో సమస్య వచ్చిపడింది. మరో వివాదం అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. మరి ఇది ఎంత వరకు వెళుతుందో చూడాలి. అసలింతకీ ఆ వివాదం ఏమిటని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వస్తే..
Also Read- Bhagyashri Borse: బ్యాక్‌గ్రౌండ్స్ సేమ్.. ‘మిస్టర్ బచ్చన్’ భామ ప్రేమలో పడిందా?
తాజాగా JEE ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలతో పలు టాప్ కాలేజీల యాజమాన్యం టాప్ ర్యాంకర్స్ అందరూ మా కాలేజీ వాళ్లే అంటూ పత్రికలో ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనలలో ఒకటే విద్యార్థి ఫొటోని రెండు కాలేజీలు ప్రదర్శించడం వివాదంగా మారింది. ర్యాంక్ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు టాప్ కాలేజీలు భారీగా అమౌంట్ ఇచ్చి ఇలా ప్రచారం చేస్తున్నారనేలా ఆరోపణలు మొదలయ్యాయి. అలాంటి పలు కార్పొరేట్ కాలేజీలకు అల్లు అర్జున్, శ్రీలీల (Sreeleela) బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా మోసం చేస్తున్న కాలేజీలను వారు ఎలా ప్రమోట్ చేస్తారు? వాళ్ల ప్రచారం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు నష్టపోతున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే కోట్ల రెమ్యూనరేషన్స్‌ని తీసుకొని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేసిన అల్లు అర్జున్, శ్రీలీలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని AISF పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అనుకోకుండా వచ్చిన ఈ వివాదంపై అల్లు అర్జున్, శ్రీలీల ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మరో వైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. అసలు అల్లు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఎందుకిలా వరుస ఘటనలు అల్లు అర్జున్‌ని వేధిస్తున్నాయి అనేలా ఫీల్ అవుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు