Bhagyashri Borse
ఎంటర్‌టైన్మెంట్

Bhagyashri Borse: బ్యాక్‌గ్రౌండ్స్ సేమ్.. ‘మిస్టర్ బచ్చన్’ భామ ప్రేమలో పడిందా?

Bhagyashri Borse: మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) చిత్రంతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది అందాల భామ ‘భాగ్యశ్రీ బోర్సే’. తొలి చిత్రంతోనే తన అందాలతో అందరినీ ఆకర్షించిన ఈ భామ, తొలి సినిమా రిజల్ట్‌తో పని లేకుండా అవకాశాలను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. మాములుగా అయితే తొలి సినిమా ఫెయిల్ అయితే, ఆ హీరోయిన్‌ని ఇండస్ట్రీ అంతగా పట్టించుకోదు. కానీ అందం, అభినయం పరంగా భాగ్యశ్రీ బోర్సే మంచి మార్కులు వేయించుకుంది. కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీని ఏలే లక్షణాలు ఉన్నాయనేలా కూడా ఆమె గురించి, ఆమె అందం గురించి విమర్శకులు రాశారు. వారు చెప్పినట్లుగానే భాగ్యశ్రీకి వరుస అవకాశాలు పలకరించాయి. అయితే అవకాశాలే కాదు, ఇప్పుడామెపై ఎఫైర్ రూమర్ కూడా నడుస్తుంది. ఆ విషయంలోకి వస్తే..

Also Read- Sumathi Shatakam: అమర్‌దీప్ చిత్రం అమరావతిలో ప్రారంభం!

‘మిస్టర్ బచ్చన్’ తర్వాత భాగ్యశ్రీ బోర్సే చేస్తున్న చిత్రం రామ్ పోతినేని (Ram Pothineni)తో అనే విషయం తెలిసిందే. ‘రాపో22’గా పిలుచుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇందులో సాగర్‌గా రామ్ పోతినేని నటిస్తుంటే, మహాలక్ష్మిగా భాగ్యశ్రీ బోర్సే కనిపించనుంది. ఈ జంట ఈ సినిమాలో చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారనేలా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ హింట్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈ ఇద్దరిపై రకరకాల వార్తలు వైరల్ అవుతుండటం విశేషం. రామ్ పోతినేని ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కానీ ఎప్పుడూ ఆయనపై ఎఫైర్, డేటింగ్ అంటూ రూమర్స్ రాలేదు. ఫస్ట్ టైమ్ భాగ్యశ్రీ బోర్సే, రామ్ పోతినేని డేటింగ్‌లో ఉన్నారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Ram Pothineni
Ram Pothineni

ఈ వార్తలకు బలం చేకూర్చేలా తాజాగా వీరిద్దరూ షేర్ చేసిన ఫొటోలు ఉండటం విశేషం. వీరు షేర్ చేసిన ఫొటోలలో బ్యాక్‌గ్రౌండ్ సేమ్ ఉండటంతో నిజంగానే వీరు డేటింగ్‌లో ఉన్నారా? అనేలా నెటిజన్లు కామెంట్స్ స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఏంటి ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారా?, మీ చేతికి ఆ ఉంగరం ఏంటి? నిశ్చితార్థం కూడా అయిపోయిందా? అనేలా నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌కి భాగ్యశ్రీ బోర్సే రియాక్ట్ కూడా అయింది. ముఖ్యంగా ఉంగరం గురించి ప్రశ్నించిన నెటిజన్‌కు సమాధానమిస్తూ.. ‘ఈ ఉంగరం నేనే కొనుక్కున్నాను’ అని చెప్పింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నా, భాగ్యశ్రీ మాత్రం చాలా లైట్‌గానే తీసుకోవడం విశేషం. నేను ఎవరితో డేటింగ్ చేయడం లేదని చెప్పడానికి చాలా సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చి, క్లారిటీ ఇచ్చేసింది.

Also Read- Samantha: విడాకులకు కారణం అదేనా? చైతూ చేసిన తప్పు ఇదేనా?

ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమాకు మహేశ్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్‌ని మేకర్స్ ఇవ్వనున్నారు. ఇక ఈ రూమర్స్‌పై రామ్ మాత్రం రియాక్ట్ కాలేదు. ఇటీవల రామ్‌కి పెళ్లి ఫిక్సయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు