Mahesh Babu: తెలుగు స్టార్ హీరో మహేష్ బాబుకు పెద్ద షాక్ తగిలింది. ఎవరూ ఊహించలేని విధంగా ఈడీ నోటీసులు పంపించడంతో ఇండీస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సురానా డెవలపర్స్, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు ఆదేశించారు. ఈడీ రైడ్స్ లో వీటికి సంబందించిన ఆధారాలను సేకరించారు.ఈ కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు రూ.5.9 కోట్లు రెమ్యునరేషన్ ముట్టినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. వాటిలో రూ.2.5 కోట్లను అక్రమంగా తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు దొరికాయి.
Also Read: Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ ఆలోచనల అనుగుణంగా పనిచేయాలి.. మంత్రి పొంగులేటి
మహేష్ బాబు చేసిన యాడ్స్ ను చూసి, ఈ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తెలియక ఎంతోమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఈ కంపెనీ యాజమాన్యం కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం ఏప్రిల్ 27న నటుడు మహేష్ బాబ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
దీనిపై రియాక్ట్ అయిన ఫ్యాన్స్ వామ్మో ఇది నిజమేనా.. మేము ఇది నమ్మలేకపోతున్నాం.. మహేష్ అన్న ఇలా చేశాడా అంటూ షాక్ లో ఉండిపోయారు. ఇంకొందరైతే యాడ్స్ ను చూసి పెట్టుబడులు పెట్టడం కరెక్ట్ కాదంటూ రియల్ ఎస్టేట్ వారిపై ఫైర్ అవుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు