Ram Goapal Varma: సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడు ఆదిత్య ధర్ భారతీయ సినిమా భవిష్యత్తును ఒంటిచేత్తో పూర్తిగా మార్చివేశారని కొనియాడారు. ఈ సినిమా ప్రేక్షకుల అభిప్రాయాన్ని కోరదని.. వారిపై ఆధిపత్యాన్ని చెలయిస్తుందని ఆర్జీవీ అన్నారు. భారతీయ సినిమా రంగాన్ని మరో స్థాయికి ఈ చిత్రం తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. సినిమాలోని ఒక్కో పాత్ర చుట్టూ గతాన్ని అల్లి.. సినిమాను ముందుకు తీసుకెళ్లిన తీరు అమోఘమన్నారు. ఒక దర్శకుడు ప్రేక్షకులకు ఇవ్వగలిగిన అత్యున్నత గౌరవం ఇదేనంటూ ఆదిత్య ధర్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు దురంధర్ నుంచి సోకాల్డ్ దర్శకులంతా నేర్చుకోవాల్సిన పది అంశాలు అంటూ ఆర్జీవీ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
ఆర్జీవీ చెప్పిన పాఠాలు..
ఇతర పాన్ ఇండియా సినిమాల తరహాలో హీరోను అతిగా చూపించే ప్రయత్నం దురంధర్ దురంధర్లో చేయలేదని ఆర్జీవీ తెలిపారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ తో హీరోను బలవంతంగా అభిమానించేలా దర్శకుడు చేయలేదన్నారు. ఆడియన్స్ చప్పట్ల కోసం ఎలాంటి ఉత్సాహం చూపించలేదని ఆర్జీవీ తెలిపారు. కథకు అవసరమైతే తన ఫేమ్ ను కూడా పక్కన పెట్టి హీరో తగ్గాల్సి ఉంటుందని నటుడు రణ్ వీర్ సింగ్ నిరూపించారన్నారు. చాలా సినిమాల్లో లాగా ప్రేక్షకులకు ప్రతీది వివరించి చెప్పడం కాకుండా.. నిశ్శబ్ద సన్నివేశాలతో ఆడియన్స్ ఆలోచన శక్తికే వాటిని వదిలేశారని ఆర్జీవీ ప్రశంసించారు.
Here are some unique lessons that all the so called film makers can learn from Dhurandhar
1.Unlike the other so called pan india big films , the film doesn’t even try to elevate the hero and give him the so called elevation moments to make the audience forcefully worship him…
— Ram Gopal Varma (@RGVzoomin) December 19, 2025
మ్యూజిక్ నాయిస్ లేదు
ఈ సినిమా హింసను ఒక దృశ్యంగా మాత్రమే కాకుండా ఒక మానసిక స్థితిగా చూపించే ప్రయత్నం చేసిందని ఆర్జీవీ తెలిపారు. ముఖ్యంగా ఇందులో గులాబ్ చేసిన యాక్షన్ అద్భుతమని ప్రశంసించారు. హాలీవుడ్ స్థాయికి మించిన యాక్షన్ దురంధర్ లో ఉందన్నారు. అనవసరమైన భావోద్వేగ సన్నివేశాలు దురంధర్ లో కనిపించవన్న ఆర్జీవీ.. బ్యాక్ గ్రౌండ్ నాయిస్ కూడా ఉండదని పేర్కొన్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడా భయపడేలా లేదని ఆర్జీవీ అన్నారు. దురంధర్ మూవీ మెుత్తం ఒక ఫైట్ లా సాగిపోతుందని.. ఒకదానికొకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ధురంధర్ విజయం మరొక బ్లాక్ బాస్టర్ కాదన్న ఆర్జీవీ.. ఇది సినీ పరిశ్రమ ఎదగడానికి ఒక హెచ్చరిక అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
Also Read: V.C. Sajjanar: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. ఆర్బీఐని కూడా వదలట్లే.. సజ్జనార్ బిగ్ అలర్ట్!
దురంధర్ డైరెక్టర రియాక్షన్..
ధురంధర్ చిత్రంపై ఆర్జీవీ చేసిన పోస్ట్ కు చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో మీరు ఒకరని అన్నారు. కొన్నేళ్ల క్రితం ఒక కల, ధైర్యం, నమ్మకంతో ముంబయికి వచ్చినట్లు ఆదిత్య ధర్ గుర్తుచేశారు. రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేయాలన్న తన కోరిక ఇప్పటికీ నెరవేరలేదన పేర్కొన్నారు. సినిమాను ఎలా తీయాలన్న విషయాన్ని మీ చిత్రాలు నేర్పలేదని.. ఎలా ప్రమాదకరంగా ఆలోచించాలన్న విషయాన్ని మాత్రం తనకు నేర్పించాయని ఆదిత్య ధర్ అన్నారు. మీ ట్వీట్ తో రాబోయే సినిమాలకు సంబంధించి తనపై మరింత బాధ్యత పెరిగిందని ఆదిత్య ధర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Sir… 🙏
If this tweet were a film, I would have gone to watch it first day first show, stood in the last row, and come out changed.
I came to Mumbai years ago carrying one suitcase, one dream, and an unreasonable belief that I would one day work under Ram Gopal Verma. That never…— Aditya Dhar (@AdityaDharFilms) December 19, 2025

