Dheeraj Mogilineni: నేషనల్ క్రష్ రష్మికా మందన్నతో ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రాన్ని నిర్మించిన ధీరజ్ మొగిలినేని.. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరుగుతున్న ప్రీ రిలీజ్ వేడుకలపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలు వేస్ట్ అని, చిత్ర నిర్మాతలకు కూడా తలకాయనొప్పిగా మారాయని చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో ప్రీ రిలీజ్ వేడుకలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది నిర్మాతలు.. ముఖ్యంగా చిన్న నిర్మాతలు స్టేజ్‌పైనే కన్నీటిపర్యంతమవుతున్నారు. కారణం, తమ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు సెలబ్రిటీలు ఎవరూ రాకపోవడమే. ఎంత ప్రయత్నించినా ఒక్కరు కూడా రావడం లేదని, బహిరంగంగా నిర్మాతలు చెబుతున్న సందర్భాలు ఈ మధ్య ఇండస్ట్రీలో రెండు మూడు జరిగాయి. ఇప్పుడు ఏకంగా అల్లు అరవింద్ సపోర్ట్ ఉన్న ధీరజ్ మొగిలినేని వంటి వారు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌పై కామెంట్స్ చేయడంతో వార్తలలో ఈ విషయం బాగా హైలెట్ అవుతోంది. ఇంతకీ ధీరజ్ ఏమన్నారంటే..
Also Read- Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!
ప్రీ రిలీజ్ వేడుకలు నా దృష్టిలో వేస్ట్
‘‘ప్రీ రిలీజ్ వేడుకలు అన్ని సినిమాలకు అవసరం లేదు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త కొత్త స్ట్రాటజీలు వెతుక్కోవాలని అన్నారు. ఒకప్పుడు ఆడియో లాంచ్‌లు మాత్రమే ఉండేది. ఇప్పుడు పాటల లాంచ్, టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ రొటీన్ అయిపోయాయి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ వేడుకలు నా దృష్టిలో వేస్ట్. వాటి వల్ల సినిమాలకు మంచి బజ్ వస్తుందని భావించడం పొరపాటు మాత్రమే అవుతుంది. ఇంకా ఈ వేడుకకు గెస్ట్‌లను పిలిచే అంశంలో నిర్మాతలకు తలనొప్పులే వస్తాయి. హీరోలు ఇలాంటి వేడుకలకు వస్తే సినిమాపై మంచి బజ్ వస్తుందని భావించి హీరోలందరికీ ఫోన్లు చేస్తుంటాం. కొన్నిసార్లు వారు రాలేరు. ఇలాంటివి నిర్మాతలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి.
Also Read- Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!
కొత్తగా ట్రై చేస్తేనే
సరే పోనీలే అని ఆపేద్దామా అంటే.. అప్పుడు నిర్మాతపై ఆరోపణలు వస్తాయి. సినిమాకు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రీ రిలీజ్ వేడుక చేయడం లేదని అంటారు. అందుకే ఇవన్నీ బాగా రొటీన్ అయిపోయాయి. ప్రమోషన్స్ పరంగా నిర్మాతలు సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి కొత్తగా ప్రయత్నించాలి. కొత్తగా ట్రై చేస్తేనే ప్రేక్షకులలోకి సినిమా వెళుతుంది. ఎంత కొత్తగా ఆలోచించి ప్రమోట్ చేస్తే.. అంతగా సినిమాపై బజ్ ఏర్పడుతుంది’’ అని ధీరజ్ చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని, సినిమా విడుదలకు ముందు అల్లు అరవింద్ టీమ్‌లోని వారు ఇలాంటి ప్రయత్నాలు చేయడం, ఇలా కాంట్రవర్సీ మాటలు మాట్లాడటం సహజమే అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా బన్నీ వాసు కూడా ఇలాగే మాట్లాడి బుక్కయిన విషయం తెలిసిందే. చూద్దాం మరి.. ఈ కామెంట్స్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి ఏ మేరకే ఫలితాన్నిస్తాయో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
