Bigg Boss Buzzz: బిగ్ బాస్ హౌస్‌లో ఎవరెవరు ఎలాంటి గేమ్ ఆడినా, బయటికి వచ్చాక జరిగే ‘Bigg Boss Buzzz’ ఇంటర్వ్యూలు ఎప్పుడూ హైలైట్ అవుతుంటాయి. తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మాధురితో సీనియర్ హీరో శివాజీ చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సంభాషణలో శివాజీ వేసిన కౌంటర్స్, సూటిగా చెప్పిన కామెంట్స్ ఆడియెన్స్‌కు యమా కిక్ ఇస్తున్నాయి. తాజాగా ఈ బజ్‌కు సంబంధించిన ప్రోమోని మేకర్స్ వదిలారు. ఇందులో..
Also Read- Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!
మీరు అనుకుంటే రాలేదు
‘‘మీరు మూడు వారాలు హౌస్‌లో ఉంటే.. ఇన్ని క్వశ్చన్స్ రాయించారండి ఆడియెన్సు. ఇంకో మూడు వారాలు ఉంటే బుక్ రాయాల్సి వచ్చేదేమో’’ అంటూ శివాజీ ఈ బిగ్ బాస్ బజ్‌ని స్టార్ట్ చేశారు. ‘మీరు అనుకున్నారు కాబట్టే వచ్చాను అన్నారు. మీరు అనుకుంటే రాలేదు.. మీరు నామినేషన్స్‌లోకి వస్తే.. ఆడియెన్స్ మిమ్మల్ని బయటకు పంపించారు. మీ ఫాంటసీ కోసం వచ్చారు అంతేనా?’ అని శివాజీ అడగగానే.. ‘నేను కూడా లైఫ్‌లో కొన్ని ఎక్స్‌పీరియెన్స్ చేద్దామని అనుకుంటున్నాను’ అని మాధురి అంది. ‘కానీ చేయలేకపోయారు’ అని వెంటనే పంచ్ ఇచ్చారు శివాజీ. ‘హౌస్ నచ్చలేదా?’ అని శివాజీ అడగగానే.. ‘దానికంటే కూడా బయటే నా అవసరం ఉందని అనిపించింది’ అని మాధురి చెప్పారు. ‘మరి బయట నీడ్ ఉన్నప్పుడు లోపలికి ఎందుకు వెళ్లారు? మీకు తెలుసు కదా?’ అని మరో ప్రశ్న వేశారు శివాజీ.
Also Read- MLA Sanjay Kumar: హృదయ విదారక ఘటన.. డబ్బులు లేక తల్లిని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొడుకు
కావాలంటే మీ పిల్లలని అడగండి
‘అసలు నా టార్చర్‌కు నేను ఫస్ట్ వీక్‌లోనే వస్తానని అనుకున్నా’ అని మాధురి అంటే, ‘వాస్తవానికి ఆడియెన్స్ కూడా వన్ వీకే అనుకున్నారు’ అని శివాజీ మరో కౌంటర్ ఇచ్చారు. సంజనాపై ఎందుకు అరిచారు? అని శివాజీ ప్రశ్నిస్తే.. ‘సంజన అసలు ఏం అర్థం చేసుకోదు. ఏం మాట్లాడుతుందో తెలియదు. తను మాట్లాడేదే కరెక్ట్ అనుకుంటుంది. తప్పు చేసినా సరే..’ అని మాధురి చెబుతుంటే.. ‘మీ గురించి మీరు చెప్పుకుంటున్నట్లుగా ఉంది నాకు ఇది’ అని శివాజీ కామెడీగా నవ్వేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిన తర్వాత ఏ మనిషికైనా సరే.. ఊహించనటువంటి డ్రాస్టిక్ ఛేంజ్ కనబడుతుంది. కావాలంటే మీ పిల్లలని అడగండి. అమ్మా నాలో ఏమైనా ఛేంజ్ కనిపిస్తుందా అని.. కచ్చితంగా కనబడుతుంది’ అని శివాజీ ఆమెకు చెబుతున్నారు. ఈ బజ్‌లో శివాజీ తన సిగ్నేచర్ హ్యూమర్, సర్కాస్టిక్ డైలాగ్స్‌తో మాధురిని ప్రశ్నల వలలో పడేశారు. నెటిజన్లు కామెంట్స్ సెక్షన్‌లో ‘శివాజీ ఫైరింగ్ ఫన్’, ‘మాధురి కన్ఫ్యూజ్ అయిపోయింది’, ‘ఇది అసలు రోస్ట్ ఇంటర్వ్యూలా ఉంది’ అంటూ రియాక్ట్ అవుతున్నారు. మొత్తంగా అయితే బిగ్ బాస్ బజ్ యమా ఇంట్రస్ట్‌గా ఉండబోతుందనేది ఈ ప్రోమో తెలియజేస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
