Ameesha-Patel (image :X)
ఎంటర్‌టైన్మెంట్

Ameesha Patel: వారితో డేటింగ్‌కు రెడీ అంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్!.. కారణం ఇదేనా..

Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్, ‘కాహో నా ప్యార్ హై’ ‘గదర్: ఎక్ ప్రేమ్ కథ’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన నటి. తన కెరీర్ ప్రారంభంలో తెలుగులో పవన్ కళ్యాణ్ తో బద్రి, మహేష్ బాబుతో నాని వంటి సినిమాల్లో నటించారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. తన 50వ ఏట కూడా ప్రేమ వివాహం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. రన్వీర్ అల్లాబాదియా హోస్ట్ చేసిన ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ, “నా వయస్సు సగం వయసు ఉన్న యువకులు నన్ను డేట్‌కు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. నేను దానికి పూర్తిగా ఓపెన్‌గా ఉన్నాను. ఎందుకంటే, ఒక పురుషుడు వయస్సుతో సంబంధం లేకుండా మానసికంగా పరిపక్వంగా ఉండాలి” అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, విస్తృత చర్చను రేకెత్తించాయి.

Read also-Bunny Vasu reaction: బండ్లన్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన బన్నీవాస్.. అప్పుడే ఆయన స్టార్ అయ్యారు

1976లో జన్మించిన అమీషా పటేల్(Ameesha Patel), 2000లో ‘కాహో నా ప్యార్ హై’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, హృతిక్ రోషన్ సరసన నటించి ఒక్కసారిగా స్టార్‌డమ్ సాధించింది. ఆ తర్వాత 2001లో వచ్చిన ‘గదర్: ఎక్ ప్రేమ్ కథ’ సినిమా ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, అమీషాను ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే, ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రేమ వివాహం విషయంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఇప్పుడు బహిరంగంగా మాట్లాడింది. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన వివాహం గురించి మాట్లాడుతూ, “నేను వివాహం చేసుకోకపోవడానికి కారణం – చాలా మంది పురుషులు నన్ను వివాహం తర్వాత నటనను వదిలేయమని, ఇంట్లోనే ఉండమని కోరారు. అది నాకు ఎప్పటికీ అంగీకరించలేని విషయం. నా కెరీర్ నాకు ముఖ్యం. నేను ముందు అమీషా పటేల్‌గా గుర్తింపు పొందాలని కోరుకున్నాను, ఎవరి భార్యగా కాదు” అని స్పష్టం చేసింది. ఈ మాటలు ఆమె స్వతంత్ర మనస్తత్వాన్ని, కెరీర్ పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి.

Read also-Viral Video: ఐఫోన్ 17 కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్న యాపిల్ లవర్స్.. పోలీసుల లాఠీ చార్జ్

అమీషా పటేల్ మాటలు కేవలం ఆమె వ్యక్తిగత కథకు మాత్రమే పరిమితం కాదు. ఆధునిక మహిళలు కెరీర్ వ్యక్తిగత జీవితంలో సమతుల్యత సాధించడం, వయస్సు ఆంక్షలను అధిగమించడం వంటి అంశాలకు ఆమె ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఆమె జీవితం, మాటలు మహిళల సాధికారతకు ప్రతీకగా మారాయి. భవిష్యత్తులో ఆమెకు సరైన జీవిత భాగస్వామి దొరకాలని, ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Just In

01

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..