OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా నేడు రిలీజ్ అయింది. ప్రస్తుతం ఎక్కడా చూసిన మిక్స్డ్ టాక్ వస్తుంది. అయితే, హైప్ ఆకాశాన్ని తాకుతోంది. అమలాపురం నుంచి అమెరికా వరకు ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆన్లైన్ లో టికెట్స్ కూడా చాలా ఫాస్ట్ గా బుక్ అవుతున్నాయి. ముఖ్యంగా, ప్రీమియర్ షోలకు డిమాండ్ ఊహించని స్థాయిలో ఉంది. టికెట్ రేట్లు పెంచినా, ఫ్యాన్స్ సినిమా లవర్స్ ‘OG’ టికెట్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
ప్రస్తుతం, ఈ చిత్రానికి పాజిటివ్ ఎంత ఉందో.. నెగిటివ్ కూడా అంతే ఉంది. ఎక్స్ లో ‘ డిజాస్టర్ ఓజీ ” అంటూ ఇప్పటికీ లక్షకు పైగా ట్వీట్స్ చేశారు. వీటిని చూసి చాలా మంది సినిమాకి వెళ్ళాలా? వద్దా అని ఆలోచిస్తున్నారు. మొదటి సారి నెగిటివ్ ను ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళ్తుంది. ‘OG’ చిత్రం విజయవాడలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం ప్రీమియర్ షోలతోనే ఒక్క విజయవాడ నగరంలో రూ.1.24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఇప్పటివరకు విజయవాడలో ఏ సినిమాకు సాధ్యం కాని అసాధారణ రికార్డ్ అని స్థానిక డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. ముందస్తు రోజు ప్రీమియర్‌లు, ఎర్లీ మార్నింగ్ షోలతో కలిపి ఈ భారీ కలెక్షన్ సాధించడం విశేషం.