SCU: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ఓజీ’ (OG) సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీమియర్స్ బుధవారం (సెప్టెంబర్ 24) రాత్రి నుంచే మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) సోషల్ మీడియాలో చేసిన స్పెషల్ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు ‘ఓజీ’ బ్యానర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ రియాక్ట్ అయిన తీరుతో.. ఇప్పటి వరకు వినిపించిన ‘సాహో’, ‘ఓజీ’ లింక్‌పై క్లారిటీ ఇచ్చినట్లయిందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా సుజీత్ తన పోస్ట్‌లో.. ‘మీరంతా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అన్నీ సెట్టయితే ‘ఓజీ’ ప్రపంచం మరింత పెద్దదవుతుంది. లవ్ యూ మై పవర్‌స్టార్’ అని ప్రత్యేకంగా చెప్పడం, వెంటనే Storming in Cinemas near U అని పేర్కొనడంతో పాటు.. అందులో SCUని హైలైట్ చేయడంతో సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ రివీల్ చేసినట్లయింది.
సుజీత్ సంభవం మరింతగా..
సుజీత్ పోస్ట్‌లోని Storming in Cinemas near Uని పోస్ట్ చేసిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు కూడా SCU హింట్ ఇచ్చారు. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓజీ’ మూవీ కనుక బ్లాక్‌బస్టర్ అయితే మాత్రం సుజీత్ సంభవం మరింతగా వ్యాపించే అవకాశం లేకపోలేదు. అసలు సుజీత్ తన పోస్ట్‌లో ఏం చెప్పారంటే.. ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నా.. మరోవైపు, కొన్నాళ్లుగా సాగిన ఈ ప్రయాణానికి ముగింపు పలకడం చాలా బాధగా ఉంది. ఈ జర్నీలో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అన్ని వేళలా నా డైరెక్షన్ టీమ్, నా టెక్నిషియన్లు నా వెన్నంటే ఉన్నారు. నన్ను నమ్మిన నిర్మాతలు డీవీవీ దానయ్య, కళ్యాణ్‌లకు థ్యాంక్స్. సంగీత దర్శకుడు తమన్, ఎడిటర్ నవీన్ నూలి.. ఇలా అందరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. లవ్ యూ మై పవర్‌స్టార్.. అని సుజీత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read- Reba Monica John: ‘కూలీ’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నెటిజన్లు ఫైర్!
ప్రమోషన్స్ సరిగా లేకపోయినా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ సరిగా చేయకపోయినా, ఇంత హైప్ రావడానికి కారణం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. నిర్మాతలు సరిగా ప్రమోషన్స్ నిర్వహించలేదు. సినిమాకు సంబంధించి చేసిన ఒకే ఒక్క ఫంక్షన్ వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. అయినా కూడా ఓ రేంజ్‌లో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. ఇక థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది కాసేపట్లో వచ్చే రివ్యూలతో తెలిసిపోనుంది.
‘S’torming in ‘C’inemas near ‘U’
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#OG #TheyCallHimOG https://t.co/ES8vvTp70L
— DVV Entertainment (@DVVMovies) September 24, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు