CM Revanth Reddy ( IMAGE credit: swetchabreporter)
నార్త్ తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth Reddy: ఆ ప్రాంత ప్రజలకు సమస్యల పరిష్కారం లక్యంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఖమ్మం నగర ప్రజల మున్నేరు వాగు నుంచి పొంచి ఉన్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి రూ.525.36 కోట్ల వ్యయంతో మున్నేరుకి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెటింగ్, వర్తక, వ్యాపార రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం అగ్రగామిగా నిలుస్తుంది. అయితే ఖమ్మం నగరం మద్య నుండి ప్రవహిస్తున్న మున్నేరు వాగు ప్రతి ఏటా వర్షాకాలంలో ఉదృతంగా పొంగి, పరిసర ప్రాంతాల ఇండ్లు, వర్తక , వ్యాపార సంస్థలు, పంటలు వరద ముంపు కి గురవుతున్నాయి. మారిన వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వస్తున్న ఆకస్మిక వర్షాలు, క్లౌడ్ బరస్ట్ లతో ప్రభుత్వ మౌళిక వసతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది.

ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు రూ.757 కోట్ల నష్టం

పనులకు వెళ్ళిన వారు, ఇంటికి వచ్చి సామాన్లు, నిత్యావసరాలు సర్దుకునే వెసులుబాటు కూడా లభించదు. దీంతో వందలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడుతున్నాయి. రోడ్లు, విద్యుత్ స్తంబాలు, సబ్ స్టేషన్లు, పాఠశాల భవనాలు, తాగునీటి వసతులు, పైపు లైన్లు, ఆరోగ్య కేంద్రాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రూరల్ మండలంలో పంటలు ముంపుకు గురవుతాయి. ఉదాహరణకు 2024 సెప్టెంబర్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ తో మున్నేరుకు వచ్చిన ఆకస్మిక వరద ముంపుతో ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు రూ.757 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు.

 Also Read: Shocking News: తెలంగాణలో షాకింగ్ ఘటన.. యువకుడి ప్రాణం తీసిన కుక్క గోరు

రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలి

మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు వాగుకు 5,863 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుండి గరిష్టంగా 10 వేల క్యుమెక్స్ వరద ప్రవహిస్తుంది. ఖమ్మం నగరం మద్య నుండి ప్రవహిస్తున్న మున్నేరు వాగుకు ఎడమ వైపు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా 379 క్యూమెక్స్ , కుడి వైపు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా 605 క్యూమెక్స్ వరద డిశ్చార్జ్ అవుతుంది. పరివాహక ప్రాంతం, నగరం నుంచి వచ్చే వరద గరిష్ట స్థాయిని దృష్టిలో ఉంచుకుని, మున్నేరు వాగుకు రెండు వైపుల సిమెంట్ కాంక్రీట్ రక్షణ గోడ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది.

మున్నేరు వాగు వరద ముంపుకు శాశ్వత పరిష్కారం

మున్నేరు వాగు వరద ముంపు సమస్యకు శాశ్వత పరష్కారానికి ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రూ.525.36 కోట్ల వ్యయంతో మున్నేరు వాగు కు రెండు వైపుల  నిర్మాణం పనులను 2024 మార్చి నెలలో ప్రారంభించారు. మున్నేరు వాగుకు రెండు వైపుల ఖమ్మం రూరల్ మండలంలో 8.5 కిలోమీటర్లు, ఖమ్మం అర్బన్ మండలంలో 8.5 కిలోమీటర్లు మొత్తం 17 కిలోమీటర్లు పొడవున 10-15 మీటర్ల ఎత్తున రిటైనింగ్ వాల్ తో పాటు, సర్వీసు రోడ్డు , డ్రైనేజ్ వ్యవస్థ సదుపాయంతో ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల నాణ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది.

మొత్తం 245.12 ఎకరాల భూసేకరణలో 106.21 ఎకరాలు ప్రభుత్వ భూమి

వరంగల్ నిపుణులతో పనుల ప్రమాణాలను తనిఖీ చేయిస్తున్నది. రిటైనింగ్ వాల్ పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఖమ్మం అర్బన్ మండలం లో మల్లేమడుగు, దానవాయి గూడెం, బుర్హాన్ పురం, ఖమ్మం గ్రామాలు , ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, గొల్లపాడు, గుడిమల్ల, గుర్రాలపాడు, ఏదులాపురం గ్రామాలకు చెందిన మొత్తం 245.12 ఎకరాల భూసేకరణలో 106.21 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 138.31 ఎకరాల పట్టా భూమిలో ఇప్పటివరకు 69.12 ఎకరాలను సేకరించడం జరిగింది.

1,666 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయింపు

భూ సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. నిర్వాసితులకు పరిహారంతో పాటు, ఇండ్ల స్థలాలు కేటాయించుటకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామంలో 139.27 ఎకరాల్లో లే-అవుట్ ను ప్రభుత్వం అభివృద్ది చేస్తున్నది. ఈ లే-అవుట్ నందు 1,666 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించనున్నారు. అన్ని మౌలిక వసతులతో మోడల్ కాలనీగా ఇది అభివృద్ధి చెందుతుంది. మున్నేరు రీటైనింగ్ వాల్ పనులు పూర్తయితే, ఖమ్మం పురోభివృద్ధికి మైలు రాయిగా నిలుస్తుంది. దశాబ్దాల సమస్యను పరిష్కరించిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుంది.

 Also Read: OTT Movie: బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో మాఫియా డాన్ తో సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే?

Just In

01

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!

Seethakka: మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలి.. మంత్రి సీతక్కఆదేశం

CM Revanth Reddy: ఆ ప్రాంత ప్రజలకు సమస్యల పరిష్కారం లక్యంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి

Operation Numkhor: భారతదేశంలోకి అక్రమంగా లగ్జరీ కార్ల తరలింపులో కదులుతున్న డొంక – లిస్ట్‌లో ప్రముఖ నటులు!