Adultery-Case
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Adultery: వివాహేతర సంబంధాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Adultery: వివాహేతర సంబంధం (Adultery) నేరం కాకపోవచ్చు, కానీ, శారీరక సంబంధాల కారణంగా బాధితులుగా మారే భాగస్వాములకు నష్టపరిహారాన్ని కోరే హక్కు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ వైవాహిక జీవితంలో ఆటంకాలు సృష్టించడమే కాకుండా, ప్రేమ, ఆప్యాయతలను దెబ్బతీసే తన భాగస్వామి ప్రియుడు/ప్రియురాలిపై వ్యాజ్యం వేయవచ్చని న్యాయస్థానం చెప్పింది. ఇటీవల ఓ కేసులో తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పురుషేంద్ర కుమార్ కౌరవ్ కీలకమైన ఈ వ్యాఖ్యలు చేశారు. వివాహేతర సంబంధ నేరం కాకపోయినా, దాని కారణంగా దుష్పరిణామలు మాత్రం ఉంటాయని అన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి తన వైవాహిక జీవితం చెదిరిపోయి బాధపడుతూ, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఆవేదనకు గురవుతున్నట్టుగా భావిస్తే, తన బాధకు కారణమైన మూడవ వ్యక్తిపై (ప్రియుడు/ప్రియురాలు) వ్యాజ్యం వేసి, నష్టపరిహారం కోరే హక్కు ఉంటుందని జడ్జి కౌరవ్ స్పష్టం చేశారు.

వివాహ బంధంపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకుంటారని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛను ఉపయోగించుకోవడం నేరంగా కాకపోయినా, చట్టపరంగా ఎలాంటి శిక్ష లేకపోయినా, వివాహేతర సంబంధం పర్యావసానాలు మాత్రం ఉంటాయన్నారు. ఇతరులకు నష్టాన్ని కలిగించేలా ఉంటే సివిల్ చర్యలకు దారితీయవచ్చని, భార్యాభర్తల బంధాన్ని చెడగొట్టిన మూడవ వ్యక్తి నుంచి నష్టపరిహారం కోరడం చట్టపరంగా సాధ్యమవుతుందని కౌరవ్ పేర్కొన్నారు. ఈ మేరకు 2025 సెప్టెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Read Also- Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. అనుమతులు లేకుండా నడుస్తున్న కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్

సుప్రీంకోర్ట్ తీర్పుపై స్పందన

వివాహేతర సంబంధం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ‘‘జోసెఫ్ షైన్ కేసులో అడల్టరీని (వివాహేతర సంబంధం) నేరంగా పరిగణించకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మాట నిజమే. దీనిర్థం, ఎవరైనా స్వేచ్ఛగా వివాహేతర సంబంధాల్లోకి వెళ్లిపోవచ్చంటూ లైసెన్స్ ఇచ్చినట్టు కాదు’’ అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. సివిల్ లేదా చట్టపరమైన ప్రభావాలు లేకుండా అడల్టరీ ఉంటుందని భావించకూడదు. మూడవ వ్యక్తి (paramour) కారణంగా తన వైవాహిక బంధం దెబ్బతిన్నదని బాధిత వ్యక్తి (భార్య లేదా భర్త) ఆరోపిస్తే
ఈ కేసు ఫ్యామిలీ కోర్టులో కాదు, సివిల్ కోర్టులో విచారించాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి కేసులు పూర్తిగా సివిల్ హక్కులకు సంబంధించినవని న్యాయమూర్తి పురుషేంద్ర కుమార్ కౌరవ్ వ్యాఖ్యానించారు. టార్ట్ చట్ట పరిధిలోకి (ఇతరుల వల్ల నష్టం) వస్తుందని, అందుకే ఇలాంటి కేసులపై విచారణకు సివిల్ కోర్టులకు హక్కులు ఉంటాయన్నారు.

Read Also- Bathukamma Festival: శ్రీ చైతన్య పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. స్త్రీల సాంప్రదాయానికి ప్రతీక

ఇంతకీ ఏంటీ కేసు?

ఈ కేసును విచారిస్తున్న జడ్జి పురుషేంద్ర కుమార్ కౌరవ్.. బాధిత భార్య పెట్టిన కేసు సివిల్ కోర్టులో కొనసాగడం చట్టబద్ధమేనని స్పష్టం చేశారు. ఆమె అభియోగాల ఆధారంగా నష్టపరిహారం కోరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో వాదిగా ఉన్న మహిళకు 2012లో పెళ్లి అయింది. 2018లో ఆమెకు కవల పిల్లలు పుట్టారు. 2021లో ప్రతివాది మహిళ తన భర్త వ్యాపారంలో చేరిందని, బిజినెస్ వ్యవహారాల పేరిట తన భర్తతో సాన్నిహిత్య సంబంధం ఏర్పరుచుకుందని వాపోయింది. తన భర్తతో కలిసి పర్యటనలకు వెళ్లేదని, కుటుంబంలో విభేదాలు వచ్చిన తర్వాత కూడా ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందని కోర్టుకు తెలిపింది. చివరకు తన భర్త బహిరంగంగానే ఆమెతో కనిపించాడని తెలిపింది. ఆ తర్వాత తన నుంచి విడాకులు కావాలని భర్త కోరాడని తెలిపింది. దీంతో, తనకు భావోద్వేగ నష్టం, భర్తను కోల్పోయినందుకు కారణమైన ప్రతివాది మహిళ నష్టపరిహారం చెల్లించాలంటూ ఆమె కోరింది.

Just In

01

Swetcha Effect: సింగపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు..స్వేచ్ఛ కథనంపై స్పందించిన రెవెన్యూ అధికారులు

Cockpit Door: విమానం గాల్లో ఉండగా.. టాయిలెట్‌కి వెళ్లిబోయి కాక్‌పిట్ తలుపుతట్టాడు!

Vote-for-Note Case: ఓటుకు నోటు కేసు.. సుప్రీంలో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

OG Censor Details: ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. తొలగించిన సన్నివేశాలివే..

Adultery: వివాహేతర సంబంధాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు