Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేని అక్రమ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మించడంపై ఆ గ్రామపంచాయతీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిక్సింగ్ ప్లాంట్లో తయారైన కాంక్రీట్ ఎటుతరలి వెళుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్లాంట్ అనుమతుల గురించి గ్రామపంచాయతీ అధికారులను వివరణ కోరగా ఎటువంటి అనుమతులు లేవని తెలపడం విశేషం. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంత ప్రజలు జీవనోపాధి కోసం స్థానికంగా ఉన్నటువంటి ఐ.టి.సి కర్మాగారానికి వందల సంఖ్యలో కార్మికులు ప్రయాణిస్తుంటారు.
పెద్ద పెద్ద భారీ వాహనాలు వేగంగా పరిమితికి మించి తిరగటంతో రహదారులు పూర్తిగా ధ్వంసమై చెరువులను తలపించడంతో ఇటీవలే ఒక విలేకరి గుంతలను తప్పించబోయి ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్రంగా గాయపడి మంచానికె పరిమితమయ్యాడు. అక్రమ ప్లాంట్ నిర్మాణంపై సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ఆ భారీ వాహనాలతో రోడ్డు ప్రమాదాలు పొంచి ఉన్నట్టే. ఇంత జరుగుతున్న అధికారులు ఏమి పట్టనట్టు ఉండటం గమనార్హం.
Also Read: Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు
నాణ్యత లోప భూయిష్టంగా కాంక్రీట్ తయారీ
భద్రాచలం లోని సారపాక ఐ టి సి ఇండస్ట్రియల్ కు ఆనుకొని ఉన్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ ఎం సి) ప్లాంటుకు ఎటువంటి అనుమతులు లేకుండా లోపబోయిష్టంగా, నాణ్యత లోపంతో తయారు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ప్లాంట్ నుంచి ప్రైవేట్ భవనాలకు, ప్రభుత్వ భవనాలకు సరఫరా చేస్తున్నారు. ఈ కాంక్రీట్ పై భద్రాచలం, సారపాక, బూర్గంపాడు సంబంధిత ప్రజలు కాంక్రీట్ తయారీపై పెదవి విరుస్తున్నారు. అదే విధంగా ఐ టి సి ఆవరణలో ఉద్యోగుల కోసం నిర్మించే క్వార్టర్స్ కు సైతం ఇక్కడి నుంచి ఆర్ఎంసి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆర్ఎంసి ద్వారా మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి
అయితే ఎంప్లాయ్ కోసం నిర్మించే క్వార్టర్స్ కు ఐ టి సి ఆవరణలోనే తయారుచేసిన ఆర్ఎంసి ద్వారా మాత్రమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులతో తయారయ్యే రెడీ మిక్స్ కాంక్రీట్ ను వాడడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇలా తయారుచేసిన ఆర్ఎంసి వాడాలంటే అందుకు సంబంధిత గ్రామపంచాయతీ, రెవెన్యూ అధికారుల నుంచి, ఆర్ అండ్ బి అధికారుల నుంచి పూర్తిగా అనుమతులు పొందాలి. కానీ, ఇక్కడ అలాంటి అనుమతులు ఏమి లేకుండానే ఆర్ఎంసి నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శుని వివరణ కోరగా, ఆ రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.