Pawan Kalyan: పవన్ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్
Pawan Kalyan ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan: తెలంగాణలో ఈవెంట్ పెట్టి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు.. పవన్ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ సినిమా విడుదలకు కూడా రెడీ అవుతుంది. వరల్డ్ వైడ్ గా.. ఈ చిత్రం సెప్టెంబర్ 25 న రిలీజ్ కు సిద్దమవుతుంది అవుతుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ‘ఓజీ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21, 2025న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ ఈవెంట్ మధ్యలో ఎడ తెరిపి లేకుండా వాన కురిసినప్పటికీ, వేలాది మంది ఫ్యాన్స్ హాజరై స్టేడియంలో సందడీ చేశారు.

Also Read: Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌తో జత కలిసిన అనూహ్య వ్యక్తి.. నవ్వుకుంటున్న ఇండియన్స్

ఇక పవన్ స్టార్ అయితే.. కత్తితో స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ అండ్ బ్లాక్ లుక్‌లో కనిపించి అందర్ని ఆకట్టుకున్నారు. ఈవెంట్‌లో మూవీ ట్రైలర్ విడుదలై, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌లో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన తమన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో, సినిమా కోసం సుజిత్, తమన్ బృందం కష్టపడిన తీరును ప్రశంసించారు.

Also Read: Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

ఆయన ‘వాషి యో వాషి’ పాటను లైవ్‌లో పాడటం ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. అయితే, ఈవెంట్ జరుగుతున్నమధ్యలో వర్షం పడుతుంటే ఆ వర్షంలో వర్షం మనల్ని ఆపుద్దా అని స్టేజ్ ముందుకు నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. పవన్ గారు బాధ్యతయుత పదవి లో ఉండి బాధ్యత మరిచారు. అంతవర్షంలోనూ ని ఈవెంట్ కి భద్రత కల్పించిన పోలీసులను మర్చిపోయావు.  వారికీ థాంక్స్ చెప్పలేదు. పండుగ రోజు తెలంగాణలో ఈవెంట్ పెట్టి.. ప్రజలకు కనీసం బతుకమ్మ పండుగ విషెస్ కూడా చెప్పలేదని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంకొందరు సినిమా ఐతే రాజకీయం.. రాజకీయం ఐతే సినిమా ఇదే మీ దినచర్య. ఆయన ఏం చేసినా మీకు తిండి దొరుతుంది. బ్రతికేయండని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Telangana Anganwadi: అంగన్వాడీలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి.. 1వ తేదీన అంగన్వాడీలకు వేతనాలు చెల్లించాలి

ఇంతకుముందు మీటింగ్ లో గొడుగు పట్టుకొని మాట్లాడుతూ అభిమానులు మీరు వర్షంలో తడుస్తున్నారు. మీరు తడిస్తే నేను తడవలేనా అని గొడుగు విసిరేశాడు నెక్స్ట్ డే మీటింగ్ లో వర్షంలో గొడుగు పట్టుకొని మొత్తం మీటింగ్ కంప్లీట్ చేశాడు. పవన్ మాటలకు చేతలకు పొంతన ఉండదని ఇంకొందరు ఫైర్ అవుతున్నారు.

Just In

01

Mahabubabad District: బినామీ రైతుల పేర్లతో వరి దందా.. అధికారుల మౌనమే అక్రమాలకు కారణమా?

Sigma Telugu Teaser: దళపతి విజయ్ తనయుడి ‘సిగ్మా’ టీజర్ ఎలా ఉందంటే..

Etela Rajender: హుజురాబాద్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతా : ఈటెల రాజేందర్!

Sivaji: ‘సారీ’ చెప్పిన శివాజీ.. కాంట్రవర్సీ ముగిసినట్లేనా?

Sivaji Comments: శివాజీ కామెంట్స్‌పై బేషరతు క్షమాపణ కోరుతూ.. ‘మా’కు ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ ఫిర్యాదు..