Crime-News
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Crime News: సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చంపేసి.. డెడ్‌బాడీ బ్యాగులో కుక్కి.. ఆ తర్వాత..

Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన లవ్ స్టోరీ చివరాఖరికి దారుణమైన హత్యకు (Crime News) దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు పాల్పడ్డాడు. తన ప్రియురాలు మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను అంతమొందించాడు. ఆకాంక్ష అనే యువతి, ప్రియుడు సూరజ్ కుమార్ ఉత్తమ్ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఇద్దరూ లివ్-ఇన్ రిలేషన్‌‌షిప్‌లో ఉన్నారు. అయితే, ఆకాంక్ష మరో యువకుడితో మాట్లాడుతున్నట్టు సూరజ్ కుమార్ అనుమానించాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య రెండు నెలల క్రితం తీవ్రమైన ఘర్షణ జరిగింది. తీవ్ర ఆవేశానికి గురైన సూరజ్ కుమార్… ఆకాంక్ష తలను గోడకేసి బలంగా కొట్టాడు. ఆ తర్వాత కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీశాడు. హత్య తర్వాత తన స్నేహితుడు ఆశీష్ కుమార్‌ను ఘటనా స్థలానికి పిలిచి, సాయం చేయాలని కోరారు. అందుకు ఆశీష్ కుమార్ అంగీకరించడంతో ఇద్దరూ ఆకాంక్ష మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో పెట్టి, మోటార్‌సైకిల్‌పై సుమారు 100 కి.మీ దూరంలో ఉన్న బండా అనే ప్రాంతానికి తీసుకెళ్లారు.

డెడ్‌బాడీని యమునా నదిలో విసిరేయాలని ప్లాన్ వేసుకొని అక్కడికి చేరుకున్నారు. అయితే, నదిలో పడేయడానికి ముందు, సూరజ్ మృతదేహం ఉన్న బ్యాగ్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత బాడీని నదిలో పడేసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఆకాంక్ష కనిపించకపోవడం, ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో ఆగస్టు 8న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురి వయసు 20 ఏళ్ల అని, ఆమె కనిపించడం లేదని పేర్కొన్నారు. సూరజ్ ఆమెను అపహరించాడంటూ ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు సూరజ్‌ను, అతడి ఫ్రెండ్ ఆశిష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు నేరాన్ని విచారణలో అంగీకరించారు. దీంతో, నిందితులు ఇద్దరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read Also- Manchu Manoj: అయోధ్య రాములవారిని దర్శించుకుని క్షమాపణలు చెప్పిన బ్లాక్ స్వార్డ్.. విషయమిదే!

ఈ కేసుకు సంబంధించిన వివరాలను దర్యాప్తు అధికారులు వెల్లడించారు. హంతకుడు సూరజ్ కుమార్ ఉత్తమ్ ఒక ఎలక్ట్రిషియన్‌ అని, జులై 21న లివ్-ఇన్ పార్టనర్ ఆకాంక్షను చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాంక్ష ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తుండేదని పేర్కొన్నారు. హంతకుడు సూరజ్ తొలుత పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడని చెప్పారు. అయితే, ఫోన్ కాల్ రికార్డులను చూపించి ప్రశ్నించగా అసలు నిజాలు ఒప్పుకున్నాడని అన్నారు. ఇద్దరికీ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఆ పరిచయం ప్రేమగా మారిందని, ఆకాంక్ష పనిచేసే రెస్టారెంట్‌కు సూరజ్ తరచూ వెళ్తుండేవాడని చెప్పాడు. ఆకాంక్ష తన అక్కతో కలిసి అక్కడ పనిచేస్తుండేదని పోలీసులు చెప్పారు.

Read Also- Swetcha Effect: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు..స్వేచ్ఛ కథనంపై స్పందించిన రెవెన్యూ అధికారులు

ఆకాంక్ష తొలుత కాన్పూర్‌ సిటీలోని బర్రా అనే ప్రాంతంలో తన అక్కతో కలిసి ఉండేదని, ఆ తర్వాత సూరజ్‌తో కలిసి హనుమంత్ విహార్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లోకి మారిందని పోలీసులు వివరించారు. కాగా, డెడ్‌బాడీని నదిలో పడేయడానికి ముందు సెల్ఫీ తీసుకున్నట్టు నిందితుడు సూరజ్ పోలీసులకు తెలిపాడు. ఆ సెల్ఫీ ఫోటోను పోలీసులు అతడి మొబైల్‌ఫోన్‌ నుంచి రికవర్ చేశారు. నిందితులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. అత్యంత దారుణమైన ఈ నేర ఘటన ఆన్‌లైన్ ప్రేమలు ఎంతటి దారుణానికి దారితీయవచ్చో మరోసారి నిరూపించినట్టు అయింది.

 

Just In

01

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం

CM Revanth Reddy: హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు