Swetcha Effect: హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించారు. విచ్చల విడిగా అక్రమ మొరం తరలిస్తూ గుట్టను లూటీ చేస్తున్న నేపథ్యంలో స్వేచ్ఛ’లో (Swetcha Effect) ప్రచురితమైన కథనం నేపథ్యంలో, తహసీల్దార్ కనకయ్య ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రంజిత్ రెడ్డి, జీపీఓ గోపి భాస్కర్ గ్రామంలోని క్వారీని పరిశీలించారు. ఈ తనిఖీలలో, అధికారులు మనోజ్ అనే వ్యక్తిని విచారించారు.
Also Read: Kishan Reddy: డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా దేశాన్ని చూడటమే లక్ష్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
చట్టపరమైన చర్యలు తప్పవు
‘స్వేచ్ఛ’ పత్రిక కథనంపై స్పందించిన రెవెన్యూ అధికారులుమనోజ్ తమ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం మాత్రమే మట్టి తవ్వుతున్నట్లు వివరించారు. భవిష్యత్తులో అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టబోనని, ఎవరూ చెప్పినా చేయబోనని ఆయన అధికారులకు హామీ ఇచ్చారు. దినిపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రంజిత్ రెడ్డి స్పందిస్తూ, అనుమతులు లేకుండా మట్టి తవ్వితే చట్టపరమైన చర్యలు తప్పవని మనోజ్‌ను హెచ్చరించారు. భవిష్యత్తులో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిపినట్లు తెలిస్తే, క్వారీతో పాటు ఉపయోగించిన హిటాచీ యంత్రాన్ని కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. అధికారుల ఈ తనిఖీలతో అక్రమ తవ్వకాలపై పర్యవేక్షణ పెరిగిందని, స్థానికుల ఫిర్యాదులపై అధికారులు త్వరగా స్పందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read:MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత
మట్టి మాఫియా.. పట్టించుకోని అధికారులు
స్థానిక మండలంలో కొన్ని రోజులగా మట్టి మాఫియాకి అడ్డు అదుపు లేకుండా పోయింది అని చెప్పుకోవాలి గత కొన్ని రోజులుగా మండలంలో పలు చోట్ల విచ్చల విడిగా మట్టి మాఫీయా రవాణా కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో పలు చోట్ల గుట్టలు తవ్వకాలు జరిపి అక్రమంగా సంపాదన పాలవుతున్నారని ప్రజలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా జేసిబి ప్రోక్లైన్ సహాయంతో ట్రాక్టర్లో లారీలతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న అధికారులు చూసి చూడనట్టుగా వివరిస్తున్నారని అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని మండల ప్రజల ఆరోపిస్తున్నారు. మండలంలోని రాత్రి పగలు తేడా లేకుండా మట్టి ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని అక్రమంగా గుట్టలు తవ్వకాలు జరుగుతుంటే అడ్డుకట్ట వేయకుండా అధికారులు నిమ్మక నేరేతున్నట్టు వ్యవహరిస్తున్నారని మండల ప్రజల ఆరోపిస్తున్నారు . ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలో మట్టి మాఫియా పై దృష్టి సారించాలని ప్రజల కోరుకుంటున్నారు.
Also Read: BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి
తొర్రూరు మున్సిపాలిటీలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు..?
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ పదవి చుట్టూ వివాదం చెలరేగింది. అసలు శానిటేషన్ ఇన్స్పెక్టరా..? లేక బిల్ కలెక్టరా..? అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది.స్థానికుల ఆరోపణల ప్రకారం గతంలో మున్సిపాలిటీలో శానిటేషన్ ఇన్స్పెక్టర్‌గా పని చేసిన కొమ్ము దేవేందర్ అక్రమాలకు పాల్పడ్డాడని, క్రమశిక్షణా చర్యలలో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో విధుల నుండి తొలగించినట్లు అధికారికంగా ఆర్డర్ కాపీ కూడా వెలువడింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ ఆర్డర్ వెలువడిన కొద్ది రోజులకే ఆయన మళ్లీ ఎలాంటి జాయినింగ్ ఆర్డర్ లేకుండా శానిటేషన్ ఇన్స్పెక్టర్‌గా చేలామణి అవుతున్నారని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
ఎవరైనా పెద్దల సహకారమ..?
దీని గురించి గతంలో స్వేచ్ఛ పత్రికలో కథనం ప్రచురించబడినప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా, ఇప్పటికీ ఆయనే పదవిలో కొనసాగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా పెద్దల సహకారమ..? లేక మున్సిపల్ యంత్రాంగంలో ఉన్న అంతర్గత లబ్ధిదారుల ధైర్యం..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తొర్రూరు పట్టణ ప్రజలు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జాయినింగ్ ఆర్డర్ లేకుండా ఎలాగా విధులు నిర్వర్తించగలరు..? కలెక్టర్ ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమైంది..? మున్సిపల్ కమిషనర్ ఎందుకు నిశ్శబ్దంగా చూస్తున్నారు..? అంటూ మండిపడుతున్నారు.ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు వెంటనే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి, పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాన్ని వెలికితీయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని. లేదంటే మున్సిపాలిటీ ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
Also Read: Hema: ‘మా’ ప్రెసిడెంట్ సిస్టర్‌కే ఈ గతి పడితే.. మంచు లక్ష్మికి సపోర్ట్‌గా హేమ సంచలన వీడియో!