Hema: ‘దక్ష’ (Daksha) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగినట్లుగా మంచు లక్ష్మి (Manchu Lakshmi) తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC)కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ జర్నలిస్ట్ తనని అడగకూడని విధంగా ప్రశ్నలు అడిగాడని, వద్దని చెబుతున్నా, ఇంకా ఇంకా రెచ్చగొట్టాడని, అతనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని మంచు లక్ష్మి ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు మంచు లక్ష్మికి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభిస్తుంది. సదరు జర్నలిస్ట్‌పై ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. ‘మేము ఏమైనా చేస్తే వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు మీ వ్యక్తి తప్పు చేస్తే ఎందుకు కామ్‌గా ఉన్నారు’ అంటూ జర్నలిస్ట్ సంఘాలను ప్రశ్నిస్తూ నటి హేమ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హేమ (Actress Hema) మాట్లాడుతూ..
ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నా..
‘‘నేను ఇటీవల కాలంలో మీడియా వల్ల చాలా సఫర్ అయ్యాను. 3 రాష్ట్రాల మీడియా పీపుల్‌తో ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాను. నాలాంటి మూర్ఖురాలు, చదువులేనిది ఏదైనా మాట్లాడవచ్చు.. తెలియకుండా తప్పు చేయవచ్చు. కానీ, మీడియా అని చెప్పుకుంటున్న జర్నలిస్ట్‌లందరూ చదువుకున్నవారు, సంస్కారవంతులు. మీరడిగే ప్రశ్నలు ఏంటంటి? మీరు ప్రచారం చేసే న్యూస్‌లు ఏంటి? ఏమైంది హేమకు.. మార్నింగే మొదలు పెట్టిందని అనుకుంటున్నారా?
Also Read- Kona Venkat: కోన వెంకట్ ‘ది రాజా సాబ్’ ట్రైలర్ రివ్యూ.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!
బాడీ షేమింగ్ చేయడం ఏంటి?
మంచు లక్ష్మి ఫిర్యాదు చూశాను. సదరు జర్నలిస్ట్‌ని నేను అడుగుతున్నాను. ఆ ప్రశ్న ఏంటి? ఈ వయసులో, ఈ డ్రస్సులు.. అంటూ బాడీ షేమింగ్ చేయడం ఏంటి? అలాంటి ప్రశ్నలు అడగవచ్చా? ఏది అడగాలి? ఏది అడగకూడదు? అది నిజమా? అబద్దమా?.. అలా ఏం లేదు. ఆ మధ్య సుమ ఓ ఫంక్షన్‌లో సరదాగా అన్న మాటని పట్టుకుని.. ఇవే తగ్గించుకుంటే మంచిది? అని ఓ జర్నలిస్ట్ అన్నారు. మరి మీరేందుకు తగ్గించుకోరు. మీ నోటికి ఏది వస్తే అది అడుగుతుంటారా? నిజాలు, అబద్దాలు తెలుసుకోకుండా న్యూస్‌లు ప్రచారం చేస్తూనే ఉంటారా? ఇది ఎంత వరకు న్యాయం? మీ జర్నలిస్ట్‌లలో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా? మీరెందుకు సదరు జర్నలిస్ట్‌ను అడగడం లేదు?
‘మా’ ప్రెసిడెంట్ సిస్టర్‌కే ఈ గతి పడితే
గతంలో కూడా మా ఇండస్ట్రీపై ఓ జర్నలిస్ట్ బూతులు మాట్లాడారు. అప్పడు మేమంతా ఫైట్ చేయడానికి వస్తే.. మా పైనే రివర్స్‌లో కేసులు పెట్టారు. ఆ రోజు మా ప్రెసిడెంట్ నరేష్.. ఎందుకు ఇలాంటి కేసులు అని కాంప్రమైజ్ చేయడంతో కేసులు తీసేశారు. ఇదే మా అసోసియేషన్‌ని నేను అడుగుతున్నాను. మంచు లక్ష్మిని ఒక యాంకర్ బాడీ షేమింగ్ ప్రశ్న వేశాడు. అది సోషల్ మీడియాలో టెలికాస్ట్ అయింది. మా అసోసియేషన్ ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ‘మా’ ప్రెసిడెంట్ సిస్టర్‌కే ఈ గతి పడితే.. మిగతా మెంబర్స్ పరిస్థితి ఏంటి? ఛాంబర్‌కు ఫిర్యాదు చేస్తే.. వాళ్లేమో మా అసోషియేషన్‌కు పంపించాం. జర్నలిస్ట్ అసోసియేషన్‌కు పంపించామని అంటున్నారు. మీరెందుకు ఇంత వరకు యాక్షన్ తీసుకోలేదు.
Also Read- Washi Yo Washi: డేగ ఓ డేగ.. ‘ఓజీ’ సర్‌ప్రైజ్ వీడియో.. ఇప్పుడే పోయేలా ఉన్నారుగా!
మంచు విష్ణు బాబు ఏం చేస్తున్నావ్..
మరి ఆ రోజు నా మీద న్యూస్ వచ్చినప్పుడు అది నిజమా? అబద్దమా? అని తెలుసుకోకుండా వెంటనే స్పందించారు కదా. మంచు విష్ణు బాబు ఏం చేస్తున్నావ్ నువ్వసలు? మీ సిస్టర్‌కే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మాలాంటి వారి పరిస్థితి ఏంటి? ఎవరెవరినో తీసుకొచ్చి డిబెట్‌లు పెట్టి, సినిమా వాళ్లపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తున్నారు. ‘మా’ అసోషియేషన్ ఉన్నది మాలాంటి నటీనటులను కాపాడుకోవడానికే కదా. నా విషయంలో వెంటనే తీసేశారు. మళ్లీ నాకు కార్డు ఇవ్వడానికి నేను మీ ఆఫీస్‌కు, ఇంటికి వచ్చాను. నా అదృష్టం మీరు నాకు బాగా తెలుసు కాబట్టి.. నాకు మళ్లీ కార్డు వచ్చింది. మీ వరకు చేరలేని వారి పరిస్థితి ఏంటి?
సుమ సారీ చెప్పే వరకు ఊరుకోలేదు
ఎవరు పడితే వారు? ఏది పడితే అది అనేయడమేనా? గతంలో వేణు స్వామి అనే వ్యక్తి.. సమంత, వారి మ్యారేజ్ గురించి ఏదేదో మాట్లాడారు. అప్పుడు జర్నలిస్ట్‌లందరూ వెళ్లి వేణు స్వామి మీద కంప్లయింట్ ఇచ్చారు కదా. ఇప్పుడు మీ వాడు కంప్లయింట్ చేసినప్పుడు మీరు కంప్లయింట్ ఇవ్వరా? సుమ చేత సారీ వీడియో పెట్టించే వరకు మీరు ఊరుకోలేదు. కొడుకు సినిమాపై ప్రభావం పడుతుందేమో అని ఆమె సారీ చెప్పింది. మరి మీరెందుకు సారీ చెప్పరు. ఇది ఖండించకపోతే.. పుట్టగొడుగుల్లా ఇలాంటివి పుట్టుకొస్తూనే ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇష్టం వచ్చినట్లుగా థంబ్‌నైల్స్ పెడుతూనే ఉన్నాయి.
Also Read- Rs 100 bribery case: వంద రూపాయల లంచం కేసులో 39 ఏళ్ల తర్వాత హైకోర్టు అనూహ్య తీర్పు
అంత లోకువైపోయామా?
ఇంకో బర్నింగ్ ఇష్యూ ఉంది. గతంలో మార్ఫింగ్ ఫొటోల మీద కంప్లయింట్ చేశాను. అప్పుడా వ్యక్తిని దుబాయ్ నుంచి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టుకు అప్పజెప్పారు. ఇప్పుడు మళ్లీ మార్ఫింగ్ ఫొటోస్ ఎక్కువైపోయాయ్. తల్లి లేదు, కూతురు లేదు.. ఎవరివి పడితే వారివి మార్ఫింగ్ వీడియోలు పెడుతున్నారు. మా పాటికి మేము మాడిపోయిన మసాలా దోసె తింటూ మా ఇంట్లో మేము ఉన్నాం.. మమ్మల్ని కెలికి రోడ్డు మీదకు తెచ్చి బద్నామ్ అవ్వవద్దని చెబుతున్నా. మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. నిజా నిజాలు తెలుసుకుని వేయండి. మేము వచ్చి వాడు ఇలా చేశాడు.. వీడు అలా చేశాడని అంటే.. హేమ వాడు, వీడు అంటుంది అని ప్రెస్ క్లబ్‌లకు వెళ్తారు. మీరు చేసిన తప్పులు మీరు సరిదిద్దుకోకుండా.. మమ్మల్ని బ్యాన్ చేయాలని మాట్లాడుతుంటారు. మా మీద కేసులు పెడుతుంటారు. అసలు ఎక్కడికి వెళుతుంది సార్ ఈ జర్నలిజం. ఏమనాలి. లేడీ జర్నలిస్ట్‌లందరూ దీనిపై రియాక్ట్ కావాలని కోరుతున్నాను. ఆ అమ్మాయిని (మంచు లక్ష్మి) అలా అడిగిన వీడియోను ఎలా టెలికాస్ట్ చేస్తారు? అంత లోకువైపోయామా? సినిమా వాళ్లంటే ఎందుకు మీకు అంత లోకువ? విష్ణు బాబు దీనిపై రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే, ఛాంబర్ వాళ్లు కూడా వాళ్లకు పంపించాం, వీళ్లకు పంపించాం అని చేతులు దులుపుకోకుండా ఇప్పుడైనా న్యాయం జరిగేలా చూడండి ప్లీజ్..’’ అని హేమ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు