Washi Yo Washi from OG
ఎంటర్‌టైన్మెంట్

Washi Yo Washi: డేగ ఓ డేగ.. ‘ఓజీ’ సర్‌ప్రైజ్ వీడియో.. ఇప్పుడే పోయేలా ఉన్నారుగా!

Washi Yo Washi: సంగీత దర్శకుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ‘వాషి యో వాషి’ అని పోస్ట్ చేస్తుంటే ఏంటో అని అంతా అనుకున్నారు. ఇలాంటి సర్‌ప్రైజ్ అస్సలు ఊహించి ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులందరికీ తాజాగా ‘ఓజీ’ టీమ్ ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘ఓజీ’ (OG Movie) సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ‘వాషి యో వాషి’ అనే ఒక ప్రత్యేక గీతాన్ని తాజాగా చిత్ర బృందం ఆవిష్కరించింది. అసలు ఈ పాట విన్నా, ఇందులో సంగీతం విన్నా.. ఈ మధ్య ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నట్లుగా.. సినిమా విడుదల వరకు కాదు.. అంతా ఇప్పుడే పోయేలా ఉన్నారు. ఆ రేంజ్‌లో ఈ పాట, మ్యూజిక్ ఉన్నాయి. థమన్‌కు కచ్చితంగా ఫ్యాన్స్ గుడి కట్టేస్తారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఒక ఎత్తు అయితే.. ఈ ‘వాషి యో వాషి’ సాంగ్ మరో ఎత్తు అని చెప్పుక తప్పదు. ఆ స్థాయిలో ఈ పాటను థమన్ కంపోజ్ చేశారు.

Also Read- Sharwanand: కాపురంలో కలహాలు.. శర్వానంద్ జంట విడాకులు తీసుకుంటున్నారా?

జపనీస్‌లో పవన్ పాట..

ఈ వీడియోను గమనిస్తే.. పవన్ కళ్యాన్ జపనీస్‌లో పాడుతున్నారు. ఒక ప్రమాదకరమైన డేంజరస్ ఈగిల్‌ను ఎలా వేటాడాలో వివరిస్తున్నట్లుగా ఈ పాటను స్వరపరిచారు. మొదట దాని రెక్కలు కోసి కిందపడేలా చేయాలి. తర్వాత దాని కళ్లు పీకి గుడ్డిదాన్ని చేసి, కదలనివ్వకుండా కాళ్లు కూడా నరకాలి. అప్పుడు దాని గుండె పీకాలి అనే అర్థం వచ్చేలా పవన్ కళ్యాన్ జపనీస్‌లో పాడుతున్నారు. ఇలా ఊహించని సర్‌ప్రైజ్‌తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇప్పటికే ‘వాషి యో వాషి’ (Washi Yo Washi Song) అంటూ సోషల్ మీడియా మారుమోగుతోంది. విడుదలైన క్షణాల్లోనే శ్రోతల మన్ననలు అందుకుంటూ.. ఈ గీతం సంచలనాలు సృష్టిస్తుండటం విశేషం. అభిమానులంతా ఈ ట్రీట్‌ని మెగా ట్రీట్ అని అభివర్ణిస్తున్నారు. అలాగే, కొన్ని రోజులుగా సరైన ప్రమోషనల్ కంటెంట్ వదలడం లేదని ఫీలవుతున్న వారంతా.. ఒక్కసారి మారిపోయి.. చిత్ర బృందాన్ని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట తర్వాత అందరూ థమన్‌ని (S Thaman) సంగీత మాంత్రికుడు అని పిలుస్తుండటం కూడా గమనించవచ్చు. తాజాగా విడుదలైన ‘వాషి యో వాషి’ సాంగ్‌.. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్‌ని మించేలా, చాలా శక్తివంతంగా ఉంది. ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైలిష్ ఆరాకు సరిగ్గా సెట్ అయ్యేలా ఈ సాంగ్ ఉంది. థమన్ అద్భుతమైన స్వరకల్పన, పవన్ కళ్యాణ్ అద్భుతమైన గాత్రం కలిసి ‘వాషి యో వాషి’ని మరుపురాని, ఫ్యాన్స్ మదిలో నిలిచిపోయే సాంగ్‌గా మలిచాయి.

Also Read- Kantara Chapter 1: ‘ఓజీ’ ట్రీట్ అయిన వెంటనే ‘కాంతార 2’ ట్రీట్.. ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది

అభిమానుల హార్ట్ బీట్‌ని పెంచేలా..

విడుదలైన క్షణాల్లోనే ఈ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే గొప్ప విందుగా ఈ పాటను అభివర్ణిస్తున్నారు. ప్రతి బీట్ అభిమానుల హార్ట్ బీట్‌ని పెంచేలా ఉండటంతో పాటు సాహిత్యం కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ‘ఓజీ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా, ‘వాషి యో వాషి’ గీతం ఆ అంచనాలను డబుల్ కాదు త్రిబుల్ పెంచేసిందనే అనాలి. ఈ సాంగ్‌తో సినిమా పట్ల అభిమానుల ఆసక్తి, ఉత్సాహం రెట్టింపు అయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా వారు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ‘ఓజీ’ పేరు ఇప్పటికే మారుమోగిపోతూ.. పలు చర్చలకు తావిస్తోంది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 25 సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కాబోతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?