Illegal Mining ( image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Illegal Mining: అడ్డు అదుపు లేకుండా జోరుగా అక్రమ మైనింగ్ దందా.. పట్టపగలే బాంబు బ్లాస్టింగ్.. ఎక్కడంటే?

Illegal Mining : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామపంచాయితీలో మమ్ములను ఎవరు ఆపలేరు -మారూటే సపరేటు అంటూ అక్రమ మైనింగ్ దందా జోరుగా సాగుతుంది.అమాయక గిరిజనులను బినామీలుగా పెట్టుకొని తమ అక్రమ మైనింగ్ (Illegal Mining) దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజీళ్ళుతుంది. కోట్ల రూపాయలు ధర్జాగా దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్,రెవెన్యూ, పారెస్ట్,పోలీస్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.


 Also Read: Gold Rate Today: సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. గోల్డ్ రేట్స్ ఎంత తగ్గాయో తెలుసా?

కింది స్థాయి అధికార్ల నుండి పై స్తాయిఅధికారులవరకు ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు వెళ్ళివెత్తుతున్నాయి.ప్రభుత్వానికి చెండాల్సిన ఖజానాని అడ్డంగా అడ్డదారిలో దోచుంటున్నా.. అధికారులు మాత్రం నోరుమెదపడంలేదు,అధికారుల అండదండలు వారికీ గట్టిగా ఉన్నాయని ప్రజలు బహిర్గతంగానే చర్చించుకుంటున్నారు.తోగగూడెంలో 8 క్వారీలు, 2 క్రస్సర్ మిల్లులు నడుస్తున్నాయి.ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న క్వారీలపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటూ అక్కడి ప్రజలు ఆగ్రహంవ్యక్తం. వ్యక్తం చేస్తున్నారు.


బినామీ పేర్లతో అడ్డంగా దోచుకుంటున్న బడాబాబులు

అమాయక గిరిజనులను మోసంచేస్తూ బినామీ పేర్లతో బడా బాబులు అడ్డంగా దోచుకుంటున్నారు. అధికారులనే కాక విలేకర్లను సైతం మేనేజ్ చేస్తూ వారి వ్యాపారం కోట్లల్లో సాగించుకుంటున్నారు.ఆర్థిక బలం, అంగబలం,రాజకకీయ పలుకుబడితో. నిలువునా దోచుకుంటున్నారని పలువులు ఆరోపిస్తున్నారు.
.ప్రభుత్వ ధనం దుర్వింయోగం అవుతున్నా అధికారులు మాత్రం తుతూ మంత్రంగా తనిఖీలు చేసి పోతారు కానీ వారిపై చర్యలు మాత్రం తీసుకోరు అంటూ అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు .ఈ మైనింగ్ మాపియాను అడ్డుకట్ట వేసి అమాయక గిరిజనులకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు.

జనరేటర్ సాయంతో బ్లాస్టింగులు

పాల్వంచ తోగ్గూడెం క్వారీలో జరుగుతున్న అక్రమ మైనింగ్ దందాను ఆపేందుకు అధికారులు కరెంట్ సప్లై నిలిపి వేయడంతో మైనింగ్ మాపియా జనరటర్ల సాయంతో పట్టపగలే రిగ్గింగ్ లు వేస్తూ బ్లాసింగ్ చేస్తున్నారు.అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, ఎన్ని సార్లు పిర్యాదు చేసినా అధికారులు మాత్రం నిమ్మకు నిమ్మకు నీరెత్తినట్లు, వ్యాహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు,ఏ క్షణం ఏమవుతుందోనని భయం గుపెట్లో బ్రతుకుతున్నాం అంటూ ప్రజలు చెబుతున్నారు,రోజు వందల సంఖ్యలో లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి.ర్యాస్ డ్రైవింగ్ తో ప్రజలు రోడ్డుపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది అంటూ ఆరోపిస్తున్నారు.కలెక్టర్ సారు స్పందించి అక్రమ మైనింగ్ క్రస్సర్ మిల్లులపై చర్యలు తీసుకొని బాంబు బ్లాస్టింగ్ ల నుండి విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు,

అక్రమ క్వారీలను సీజ్ చేసిన తీరు మారని మైనింగ్ మాపియా

గతంలో అధికారులు ఎన్ని సార్లు అనుమతులు లేని అక్రమ క్వారీలను సిజ్ చేసినా వారి తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు.రోజుకు వందల సంఖ్యలో కంకర కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటుపడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.ప్రశ్నించినవారిని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వున్నాయి,అడ్డువస్తే అంతుచుడడానికైనా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.ఈ అక్రమ మైనింగ్ ఆపే నాధుడే లేరా అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ అదయానికి గండికొడుతున్న మైనింగ్ అక్రమార్కుల పై చర్యలు తీసుకొని అనుమతులు లేని క్వారీలను పూర్తిగా ముసివేయాలని ప్రజలు కోరుతున్నారు.

 Also Read: MLA Raja Singh: కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాజాసింగ్.. బీజేపీ మీవల్లే నాశనమైదంటూ..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!