FSD Officer Controversy: మెడికల్ కార్పొరేషన్ లో ఓ ఆఫీసర్ చక్రం తిప్పుతున్నారనే ప్రచారం డిపార్ట్ మెంట్ లో విస్తృతంగా జరుగుతున్నది. సెంట్రల్ సర్వీస్ నుంచి ఎఫ్ ఎ స్ డీపై వచ్చిన ఆఫీసర్.. కార్పొరేషన్ లో తిష్ట వేశారు. గడువు ముగిసినా, ఇంకా ఎఫ్ ఎస్ డీపైనే ఎలా కొనసాగుతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ఎఫ్ ఎస్ డీ(ఫారెన్ డిప్యూటేషన్ సర్వీస్) పై కార్పొరేషన్ కు రాగా, 2024 తో ఆయన గడువు ముగిసింది. కానీ ఇప్పటి వరకు ఆయన కార్పొరేషన్ లోని తన సీటు ను వదల్లేదు. నిబంధనలు ప్రకారం ఫారెన్ డిప్యూటేషన్ సర్వీస్ గరిష్టంగా 5 ఏళ్ల వరకు కొనసాగుతుంది. కానీ సదరు అధికారి సమయం ముగిసినా, ఇప్పటికీ అదే సీట్ లో కుర్చోని హవా నడిపిస్తున్నారనే చర్చ ఉన్నది.
మందులు కొనుగోళ్లు, టెండర్ల ప్రాసెస్ లో ఆయనదే కీ రోల్. మందుల బిల్లులు ఎంట్రీ చేయాలన్నా.. క్లెయిమ్ కావాలన్నా.. కమీషన్లు ఇవ్వాల్సిందే. బిల్లులు ఎంట్రీకి 2 శాతం, క్లెయిమ్ కు మరో రెండు శాతం చొప్పున చెల్లించనిదే పని కాదు. కార్పొరేషన్ లో ఏ పని పూర్తి కావాలన్నా.. ఆయన్ను సంప్రదించి కమీషన్లు అప్పగిస్తే.. ఇట్లే పూర్తయిపోతుందనే చర్చ అదే ఆఫీస్ లోని ఉద్యోగుల మధ్య జరుగుతున్నది. ఇటీవల కమీషన్లు ఇవ్వనిదే బిల్లులు క్లెయిమ్ చేయడం లేదని కొన్ని కంపెనీలు ఏకంగా మంత్రి కి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన కూడా అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. త్వరలోనే ఆ రిపోర్టు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు చేరనున్నది.
ఫస్ట్ ఇన్..ఫస్ట్ ఔట్ లోనే వసూళ్లే.?
మెడికల్ కార్పొరేషన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా కమీషన్ల పర్వం కొనసాగుతున్నట్లు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందాయి. దీంతో ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అనే విధానాన్ని అమలు చేయాల్సిందేనని హెల్త్ సెక్రటరీ గతంలో ఆదేశాలిచ్చారు. అంటే ఏ కంపెనీ తొలుత మందులు సప్లై చేసి ఉంటే, దానికి ఆటోమెటిక్ గా షెడ్యూల్, బడ్జెట్ ప్రకారం నిధులు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విధానంలోనూ కమీషన్లు లేనిదే ప్రాసెస్ చేయడం లేదని కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఎఫ్ ఎస్ డీపై వచ్చిన అధికారి ముడుపులు లేనిదే బిల్లులు, క్లెయిమ్స్ కావని నేరుగా చెప్తున్నారట. దీంతో మందుల కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి.
Also Read: OTT Movie: ఫ్యామిలీ సీక్రెట్ తెలుసుకునే క్రమంలో బయటపడిన డెడ్ బాడీ.. ఏం జరిగిందంటే?
మందులు సప్లై చేసి రెండు, మూడేళ్ల వరకు బిల్లులు కోసం వెయిట్ చేసింది పోయి, కమీషన్లు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏమిటో? అర్థ కావడం లేదని ఓ కంపెనీ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఫైనాన్స్ శాఖ లో బిల్లులు క్లెయిమ్ కావాలంటే పది నుంచి పదిహేను శాతం ఇవ్వాల్సి ఉంటుందని, ఇక్కడ కేవలం నాలుగు శాతం ఇవ్వలేరా? అని సదరు ఆఫీసర్ కంపెనీలపై ప్రెజర్ తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి కార్పొరేషన్ లోని మిగతా ఉద్యోగులు అవాక్కవుతున్నారు. మంగళవారం పెండింగ్ బిల్లుల కొరకు ప్రభుత్వం నుంచి రూ.445 కోట్లు డ్రగ్స్ కొరకు, రూ.26 కోట్లు సర్జికల్ ఐటమ్స్ నిమిత్తం కార్పొరేషన్ కు వచ్చాయి. వీటి పంపిణికి కూడా సదరు ఆఫీసర్…కమీష
ఎండీలు ఎవరున్నా…ఆయన చెప్పిందే వేదం..?
గడిచిన ఐదేళ్లలో ముగ్గురు మెడికల్ కార్పొరేషన్ లో ముగ్గురు ఎండీలు మారారు. ప్రస్తుతం ఇటీవల మరో ఎండీ వచ్చారు. కానీ ఇప్పటికీ సదరు ఎఫ్ ఎస్ డీ ఆఫీసర్ చెప్పిందే నడుస్తుందని ఉద్యోగుల్లో టాక్. పైగా తాను చెప్పిన డీల్ కు ఒకే అంటే, ఎండీలు కూడా కంపెనీలకు ఎలాంటి ఇబ్బందులు పెట్టరని సదరు ఆఫీసర్ సెటిల్ మెంట్లకు దిగడం గమనార్హం. అసలు వైద్యారోగ్యశాఖ డిపార్ట్ మెంట్ కు సంబంధం లేని అధికారి..ఈ తరహాలో చక్రం తిప్పడంపై మిగతా ఉద్యోగులు, ఆఫీసర్లు కూడా అవాక్కవుతున్నారు.
కరోనా సమయంలోనూ కంపెనీల నుంచి భారీ స్థాయిలో కమీషన్లు పొందినట్లు సమాచారం. టీజీ మెడికల్ కార్పొరేషన్ లో గతంలో ఈ తరహాలో ఎవరూ వ్యవహరించలేదని, ఈ ఒక్క అధికారితో కార్పొరేషన్ కు చెడ్డపేరు వస్తుందని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. పైగా ఇన్నీ ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నా…ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకపోవడంతో ఆయన పెత్తనం మరింత పెరుగుతున్నదట. పై లెవల్లో తనకు అండదండలు ఉన్నట్లు ప్రచారం కూడా చెస్తున్నారట. ఈ కమీషన్ల పర్వంపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించకపోతే, బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదం ఉన్నదని మిగతా ఉద్యోగులు చెప్తున్నారు.
Also Read: Seethakka: మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలి.. మంత్రి సీతక్కఆదేశం