NC24 poster postponed: వాయిదా పడిన ‘NC 24’ పోస్టర్ అప్డేట్..
NC-24( IMAGE;x)
ఎంటర్‌టైన్‌మెంట్

NC24 poster postponed: వాయిదా పడిన ‘NC 24’ హీరోయిన్ పోస్టర్ అప్డేట్.. కారణం ఇదే..

NC24 poster postponed: చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో, సినీ ప్రముఖులు సహా ప్రజలందరూ దుర్ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, హీరో నాగచైతన్య తన కొత్త సినిమా ‘NC24’ నుంచి నేడు విడుదల కావాల్సిన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. సినిమా యూనిట్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. “చేవెళ్ల ప్రమాదం వల్ల మేము దిగ్భ్రాంతికి గురయ్యాం. బాధితుల కుటుంబాలకు మనస్పూర్తిగా సంతాపం తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో, ‘NC24’ హీరోయిన్ పోస్టర్ విడుదలను రేపటికి వాయిదా వేస్తున్నాం,” అని టీమ్ ప్రకటించింది.

Read also-Baahubali The Epic: అదరగొడుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ వీకెండ్ కలెక్షన్లు.. ఎంతంటే?

కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నాగచైతన్యను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించబోతున్న ఈ చిత్రం మీద అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటన నేపథ్యంలో నాగచైతన్య టీమ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో “ఇది సరైన నిర్ణయం”, “సమాజం పట్ల బాధ్యత చూపిన టీమ్‌కు అభినందనలు” అంటూ స్పందిస్తున్నారు.

Read also-Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

తెలంగాణ రాష్ట్రం రాంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లా మండలం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిరజగూడ గ్రామం దగ్గర హైదరాబాద్–బీజాపూర్ హైవేపై ప్రయాణిస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సును, ఎదురుగా వస్తున్న గ్రావెల్ ట్రక్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ట్రక్ అధిక వేగంతో తప్పు దిశలో వస్తూ బస్సును ఢీ కొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై, ప్రయాణికులు లోపల ఇరుక్కుపోయారు. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Just In

01

Droupadi Murmu: నియామకాల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Vrushabha Trailer: కింగ్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ ‘వృషభ’ ట్రైలర్ వచ్చేసింది చూశారా?

Pidamarthi Ravi: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం హామీ నెరవేర్చాలి : పిడమర్తి రవి

Train Hits Elephants: రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని 8 ఏనుగులు మృతి.. ఘోర ప్రమాదం

Villages Development: పల్లెల అభివృద్ధి ఎవరి చేతుల్లో? గ్రామాభివృద్ధిపై నూతన పాలకవర్గాల ఫోకస్!