Mirai Collections : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, బ్లాక్‌బస్టర్ టాక్‌తో అభిమానులను ఆకట్టుకుంది. రితికా నాయక్ కథానాయికగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన ఈ సినిమా, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం వంటి నటీనటులు నటించారు.
బాక్సాఫీస్ వసూళ్ల తుఫాన్
రిలీజ్ అయిన తొలి ఐదు రోజుల్లోనే మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటి అద్భుత విజయం సాధించింది. ఏడు రోజులు పూర్తయ్యేసరికి, ఈ చిత్రం 112.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకెళ్లింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ స్టైలిష్ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ నెల 25 వరకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో మిరాయ్ మరిన్ని కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై విశ్వప్రసాద్ నిర్మించిన మిరాయ్, అశోకుడు రాసిన 9 పవిత్ర గ్రంథాల చుట్టూ తిరిగే ఒక ఆసక్తికర కథాంశంతో రూపొందింది. ఫాంటసీ, అడ్వెంచర్, యాక్షన్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా మేళవించిన ఈ మూవీ, ముఖ్యంగా క్లైమాక్స్‌లో శ్రీరాముడి ఎలిమెంట్‌ను ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్క్రీన్‌పై ఈ సీన్స్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన తీరు ఆడియన్స్‌ను ఫిదా చేసింది.
సుమారు 50-60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన మిరాయ్, మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద దూకుడు కనబరిచింది. జియోహాట్‌స్టార్ ఈ సినిమాని డిజిటల్ హక్కులను 40 కోట్ల రూపాయలకు కైవసం చేసుకోవడంతో, నిర్మాతలు ఇప్పటికే బడ్జెట్‌లో 90% రికవరీ చేశారు. దీనితో, ప్రస్తుతం సాధిస్తున్న కలెక్షన్లు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి