Telangana Govt Plans: రాష్ట్రంలో మాతృ, శిశు, నవజాత శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్ కు తీసుకొచ్చేందకు ప్రభుత్వం (Telangana Govt Plans)చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ మరణాలను తగ్గించడంలో గణనీయమైన ప్రగతి సాధించిన రాష్ట్రం.. 2030 నాటికి మరింత అభివృద్దిని సాధించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ (Hyderabad) లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సంకల్ప్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు శిశువు పుట్టిన మొదటి 28 రోజులు అత్యంత కీలకమైనవని, ఈ సమయంలో సరైన వైద్యం అందిస్తే మరణాలను పూర్తిగా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఆధునిక పరికరాలతో బలోపేతం చేయాలి
ఇందుకోసం ప్రణాళితో ముందుకెళ్లనున్నట్లు ప్రకటించారు. తల్లి, బిడ్డ ఒకే యూనిట్ లో చికిత్స తీసుకునేలా కంగారూ యూనిట్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బందికి అధునాతన శిక్షణ ఇవ్వాలని, గవర్నమెంట్ మెటర్నిటీ సెంటర్లను ఆధునిక పరికరాలతో బలోపేతం చేయాలని నిర్ణయించారు. తల్లులకు కిట్స్ ఇచ్చి ప్రొత్సహించాలని, అవసరమైన చోట వైద్య సిబ్బందిని, డాక్టర్లను నియమించాలని ఈ సంకల్ప్ కార్యక్రమంలో నిర్ణయించారు.
Also Read: Shabana Azmi: పుట్టింది స్టార్ కుటుంబంలో.. అయినా టీ అమ్మింది.. కట్ చేస్తే అయిదు జాతీయ అవార్డులు
డ్రాప్ అవుట్ రేటు తగ్గించాలి.. మెంటర్‌షిప్, కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అధికారులు సమాయత్తం కావాలని, డ్రాప్‌అవుట్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. మెంటర్‌షిప్, కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ఫలితాలు సాధించిన గురుకులాలను మోడల్ ఇన్‌స్టిట్యూట్లుగా అభివృద్ధి చేసి, ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలపాలని సూచించారు.
టెక్నాలజీ యాక్సెస్ పై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి
విద్యార్థుల స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ యాక్సెస్ పై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉన్నత విద్య, జాతీయ ప్రవేశ పరీక్షల (జేఈఈ, ఐఐటీ, నీట్, యూపీఎస్సీ,ఎస్ఎస్సీ) కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు సమగ్రంగా అందేలా చూడాలన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి, వారి అవసరాలను దృష్టిలో ఉంచి విధానాలు అమలు చేయాలని ఆదేశించారు. సంక్షేమ కార్పొరేషన్లు తీసుకున్న పథకాలను పేద ప్రజలకు సులభంగా చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సాంకేతికతను వినియోగించి (డిజిటల్ మానిటరింగ్, ఆన్‌లైన్ గ్రీవెన్స్) పారదర్శకతను పెంచాలని సూచించారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు లభించేలా సంక్షేమ విధానాలను సమగ్రంగా అమలు చేయాలని ఆదేశించారు.త్వరలో సీఎంకు సమగ్రమైన నివేదికను సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్య సాషి ఘోష్ తదితరులు పాల్గొన్నారు.