Meena: ఎవరు విడాకులు తీసుకున్నా.. పెళ్లి నాతో చేసేవారు..?
meena ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Meena: ఎవరు విడాకులు తీసుకున్నా.. పెళ్లి నాతో చేసేవారు.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్

Meena: సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు తెలుగు సినీ అభిమానులకు సుపరిచితం. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ నటి, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించి, తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఇటీవల, సీనియర్ హీరో జగపతి బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” అనే టాక్ షోలో మీనా గెస్ట్ లా పాల్గొంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన జీవితంలోని కొన్ని మరపురాని ఘట్టాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ షోలో మాట్లాడుతూ మీనా తన సినీ ప్రస్థానం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది.

Also Read: Ramchander Rao: ఫీజు రీయింబర్స్ మెంట్ పై సర్కార్ కు స్పష్టత కొరవడింది.. రాంచందర్ రావు సంచలన కామెంట్స్

” కొందరు నిర్మాతలు తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీస్తామని నా దగ్గరకు వచ్చేవారు. ఆ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ, ఆ తర్వాత నన్ను పట్టించుకునేవారు కాదు. అవకాశాలు వెల్లువెత్తుతున్న సమయంలోనే నేను పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది. అప్పుడు ‘దృశ్యం’ మూవీ కోసం నన్ను కాంటాక్ట్ అయ్యారు. కూతురు చిన్నది కావడంతో మొదట నేను తిరస్కరించాను. కానీ, దర్శకుడు ‘ఈ కథ మీ కోసమే రాసామని, మీరు లేకుండా సినిమా ఊహించలేమ’ని చెప్పడంతో ఇక చేయాల్సి వచ్చింది” అని మీనా చెప్పుకొచ్చింది.

Also Read: Land Grabbing Case: హైకోర్టు న్యాయవాది ఇంటిని కబ్జా చేయాలనే కుట్ర.. నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్!

అంతేకాదు, తన రెండో వివాహం గురించి వచ్చిన పుకార్లపై కూడా మీనా రియాక్ట్ అయింది. ” నా భర్త మరణించిన కొద్ది రోజుల్లోనే నేను రెండో పెళ్లి చేసుకున్నానని కొందరు రూమర్స్ పుట్టించారు. ఆ టైం లో ఆ రూమర్స్ నాకు చాలా బాధను కలిగించింది. ‘ఇలాంటి వాళ్లకు కుటుంబాలు ఉండవా? ఇలా ఎందుకు రాస్తారు?’ అని అనుకున్నా. ఈ పుకార్లు కొన్ని రోజులు అయితే.. అనుకోవచ్చు కానీ చాలా కాలం కొనసాగాయి. ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా, వారి పెళ్లి నాతోనే అని రాసేవారు,” అంటూ భావోద్వేగానికి లోనైంది మీనా. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: Land Grabbing Case: హైకోర్టు న్యాయవాది ఇంటిని కబ్జా చేయాలనే కుట్ర.. నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్!

Just In

01

Samsung Galaxy S26 Ultra: సామ్‌సంగ్ ఫ్యాన్స్‌కు షాక్.. Galaxy S26 Ultra ఆలస్యం వెనుక కారణం ఇదేనా..?

Narasimha Re-release: తన ఐకానిక్ పాత్ర నీలాంబరిని చూసి తెగ మురిసిపోతున్న రమ్యకృష్ణ..

Pawan Sacrifice: ‘హరిహర వీరమల్లు’ సినిమా అంత పని చేసిందా?.. వాటి అప్పులు కట్టడానికి పవన్ ఏం చేశారంటే?

Artificial Intelligence: డాక్టర్లు గుర్తించలేకపోయారు.. Grok AI వల్లనే బతికానంటున్న 49 ఏళ్ల వ్యక్తి

Delhi Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ఫ్లైట్ ఢిల్లీకి తిరిగి మళ్లింపు