Mahesh and Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా SSMB29 గ్లోబ్‌ట్రాటర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి నవంబర్‌లో అప్‌డేట్ రాబోతోందని జక్కన్న ప్రకటించారు. సినిమా యూనిట్ అధికారికంగా నవంబర్ నెలలో ఒక ‘నెవ్వర్-బిఫోర్-సీన్’ రివీల్ ఉంటుందని గతంలో ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం, 15 నవంబర్, 2025న హైదరాబాద్‌లో ఒక గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో సినిమా యొక్క అధికారిక టైటిల్‌తో పాటు, మహేష్ బాబు యొక్క ఫస్ట్ గ్లింప్స్ (First Glimpse) వీడియోను లేదా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
గ్లోబ్‌ట్రాటింగ్ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ సైతం మహేష్ బాబు లుక్ అద్భుతంగా ఉంటుందని, నవంబర్‌లో ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని ధృవీకరించారు. ఈ చిత్రం ఒక భారీ గ్లోబ్‌ట్రాటింగ్ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మహేష్ బాబు పాత్ర ఒక సాహస యాత్రికుడిగా ఉంటుందని, ఈ సినిమా కోసం ఆయన చాలా రిస్క్ స్టంట్స్‌ను డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కీలక పాత్రల్లో ప్రియాంకా చోప్రా జోనస్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నవంబర్ అప్డేట్ గురించి మహేష్ బాబు, రాజమౌళి మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ నడించింది. ఇప్పుడా సంభాషణ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ముందుగా..
Also Read- Rajashekar: అది లేకపోతే జైల్లో ఉన్నట్టే ఉంటుంది.. ‘కె ర్యాంప్’ సాంగ్‌పై కూడా వేసేశాడు
మీరు మాకో హామీ ఇచ్చారు
‘ఆల్రెడీ నవంబర్ నెల వచ్చేసింది రాజమౌళి’ అని మహేష్ బాబు ట్వీట్ చేయగా.. దానికి ‘ఎస్.. ఏ సినిమాకు రివ్యూ ఇద్దామని అనుకుంటున్నావ్ ఈ నెలలో’ అని రాజమౌళి సరదాగా కామెంట్ చేశారు. వెంటనే రాజమౌళి రియాక్ట్ అవుతూ.. ‘మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో నిమగ్నమై ఉన్నారేమో.. దాని కంటే ముందు నవంబర్‌లో అంటూ మీరు మాకో హామీ ఇచ్చారు. దాని సంగతి చూడండి’ అని పోస్ట్ చేశారు. ‘ఆ పని ఇప్పుడే మొదలైంది.. నిదానంగా ఒక్కొక్కటి రివీల్ అవుతాయి’ అని మరో పోస్ట్ రాజమౌళి నుంచి రాగా, ‘ఇంకా ఎంత నిదానంగా సార్.. 2030లో ప్రారంభిద్దామా? మీకు తెలుసో లేదో.. మన దేశీ గాళ్ ప్రియాంకా చోప్రా.. జనవరి నుంచి హైదరాబాద్‌లోని ప్రతి స్ట్రీట్‌ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తుంది’ అని మహేష్ రిప్లయ్ ఇచ్చారు. వెంటనే ప్రియాంకా చోప్రా రెస్పాండ్ అవుతూ.. ‘‘హలో!! హీరో!!! నువ్వు సెట్ లో నాతో పంచుకునే కథలన్నీ నేనే లీక్ చేయాలనుకుంటున్నావా? మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఏసేస్తా’’ అని పోస్ట్ చేశారు. ‘నువ్వు ఆమెని ఎందుకు రివీల్ చేశావ్.. సర్‌ప్రైజ్ లేకుండా చేశావ్‌గా’ అని మహేష్‌ని ట్యాగ్ చేశారు రాజమౌళి.
ఓరి దీని యేశాలో
‘సర్‌ప్రైజా.. అంటే పృథ్వీరాజ్ సుకుమారన్‌ని కూడా సర్‌ప్రైజ్ అనుకుంటున్నారా?’ అని మళ్లీ మహేష్ ప్రశ్నించారు. వెంటనే పృథ్వీరాజ్ సుకుమారన్ లైన్‌లోకి వచ్చారు. ‘సార్ రాజమౌళిగారూ.., ఈ హైదరాబాద్ వెకేషన్ గురించి నాకు చాలా విషయాలు తెలియవు. నేను దీన్ని ఇంకా ఇలాగే కొనసాగిస్తే, నా కుటుంబం నన్ను అనుమానించడం ప్రారంభిస్తుంది’ అని పృథ్వీరాజ్ పోస్ట్ చేశారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ సీరియస్ ఎమోజీలు పెట్టి.. ‘నువ్వు అన్నీ నాశనం చేస్తున్నావ్’ అని ట్వీటారు. ‘అయితే ఓ సంధి చేసుకుందాం.. రేపు ఏదో ఒకటి ప్రకటించండి, అది అందరికీ ఇప్పటికే తెలుసు. మీరు ఇప్పటికీ దీనిని ఒక ఆశ్చర్యం అని పిలుస్తారు’ అని మహేష్ కౌంటర్ ఇచ్చారు. ‘సరే సరే.. కానీ మీ నాపై అతిగా వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి.. అందుకు జరిమానాగా.. మీ ఫస్ట్ లుక్ విడుదలను ఆలస్యం చేయాలని అనుకుంటున్నాను’ అని రాజమౌళి రియాక్ట్ అయ్యారు. ‘నాకు తెలుసు సార్.. మీరు మీ విలన్లని బాగా ప్రేమిస్తారని’ అని పృథ్వీరాజ్ పోస్ట్ చేశారు. వెంటనే ప్రియాంకా.. ‘నవ్వుతూ.. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ మహేష్.. మండిందా?’ అంటూ బ్రహ్మి సైగ్ చేస్తున్న పిక్‌ని షేర్ చేశారు. ‘ఓరి దీని యేశాలో.. రాజమౌళి ఎప్పుడూ ది బెస్ట్‌ని లాస్ట్‌కే ఉంచుతారు’ అని మహేష్ టైమింగ్ పంచ్‌ని వదిలారు. ఇలా వారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ నడిచింది.
It’s November already @ssrajamouli 👀
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
