K-Ramp teaser: టాలీవుడ్‌లో తనదైన మార్క్‌తో ప్రేక్షకుల మనసులు ఆకర్షించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మరోసారి వినోదాత్మక ప్రయత్నంతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, తాజాగా ‘కె-ర్యాంప్’ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు నిర్మాతలు. ఈ చిత్రం యాక్షన్, కామెడీ, రొమాన్స్ మిక్స్‌తో పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ బజ్ క్రయేట్ అయింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా, కిరణ్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘కె-ర్యాంప్’ టీజర్ ఇటీవల విడుదలై, సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జైన్స్ నాని దర్శకత్వంలో హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై రాజేష్ దండా నిర్మించారు. ఈ టీజర్ యూట్యూబ్‌లో విడుదలైన వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టీజర్ ఆధారంగా, ఈ చిత్రం ప్రేమ, హాస్యం, వినోదంతో నిండిన ఒక ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.
Read also-Oil Kumar: ప్రతిరోజూ 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ తాగుతున్నాడు.. ఇంతవరకు హాస్పిటల్ ముఖం చూడలేదు!
టీజర్ ను చూస్తుంటే.. కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ యాక్షన్ తో మరో సారి మన ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది. డబుల్ మీనింగ్ మాటలు ఎక్కువగా ఉన్నా ‘కె-ర్యాంప్’ టీజర్‌లో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా మధ్య కెమిస్ట్రీ యువతను ఆకర్షించేలా ఉంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేమ భావనలను సున్నితంగా వ్యక్తం చేస్తాయి. ఈ సన్నివేశాలు చూస్తుంటే, సినిమాలో యూత్‌ఫుల్ రొమాన్స్‌తో పాటు కామెడీ కూడా బాగా వర్కౌట్ అవుతుందని అర్థమవుతోంది. టీజర్‌లోని సంభాషణలు యువతకు కావాల్సిన మసాలాలు అందించేలా ఉన్నాయి. హీరో, హీరోయన్ ల మధ్య రొమాన్స్ అయితే హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది. డైలాగులు ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చకపోయినా కొంత మందికి మాత్రం బాగా నచ్చుతాయి. విడుదలైన టీజర్ ను చూస్తుంటే.. ఈ సినిమా కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడేలా కనిపిస్తుంది. ఈ సినిమా విడుదల కోసం కిరణ్ అబ్బవరం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.