Idli Kottu Song Still
ఎంటర్‌టైన్మెంట్

Idli Kottu: ప్రమోషన్స్ స్టార్ట్.. ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ వచ్చింది.. చాలా ‘కొత్తగుందే’!

Idli Kottu: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల వచ్చిన ‘కుబేర’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ నుంచి రాబోయే చిత్రానికి హీరో మాత్రమే కాదు.. ఆ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను కూడా ధనుష్ నిర్వర్తించారు. ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘ఇడ్లీ కొట్టు’ అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. చిత్ర ఫస్ట్ లుక్ కూడా మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. అక్టోబర్ 1న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి.. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్ అందరినీ ఆకర్షిస్తూ.. అప్పుడే ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌కి చేరుకుంది.

Also Read- KTR: జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వినగానే కనెక్ట్ అయ్యేలా..

‘కొత్తగుందే’ అంటూ ఫీల్ గుడ్ మెలోడీగా వచ్చిన ఈ సాంగ్‌ను జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేశారు. సింగర్స్ కృష్ణ తేజస్వి, శ్వేతా మోహన్ వోకల్స్ సాంగ్‌కి మరింత మెలోడీ వైబ్‌ని తీసుకురాగా, సామ్రాట్ నాయుడు ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఈ సాంగ్‌లో ధనుష్, నిత్యా మీనన్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా ఉండటమే కాకుండా.. చూడటానికి కనుల విందుగా ఉంది. ఈ పాటను వినగానే కనెక్ట్ అయ్యేలా జీవీ బాణీలను సమకూర్చారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ భాస్కరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా ధనుష్‌కు ఇది నాలుగో చిత్రం.

Also Read- Jayammu Nichayammu Raa: డాడీ అని పిలిచిన తేజ సజ్జా.. ఫీలైన జగ్గూ భాయ్.. వీడియో వైరల్!

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది ఎవరంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై నిర్మాత రామారావు చింతపల్లి గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్‌కు భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫ్యాన్సీ రేటుకు ఆయన రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ధనుష్ సినిమాకు లేని విధంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ వంటి వారంతా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కౌశిక్ డీవోపీ‌గా, ప్రసన్న జీకే ఎడిటర్‌గా, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించి గ్రాండ్ సక్సెస్ అందుకుంటుందని.. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?