Court Movie: నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి ” కోర్ట్: State Vs A Nobody ” విడుదలైంది. హీరో ప్రియదర్శి, యంగ్ హీరో హర్ష రోషన్, హీరోయిన్ శ్రీదేవి, నటుడు శివాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా మన ముందుకొచ్చి పెద్ద హిట్ గా నిలిచింది. దీని బడ్జెట్ కూడా చాలా తక్కువ. బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. రూ. 11 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన 3 వారాల్లోనే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. కథ మంచిగా ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా ఆడియెన్స్ ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం ..
థియేటర్ లో ఈ సినిమాని మిస్ అయిన వారు త్వరలోనే ‘కోర్ట్’ ఓటీటీ లవర్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది.త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. పోక్సో చట్టం గురించి చాలా మందికి తెలియదు. ఈ సినిమాలో చాలా బాగా చుపించారు. దానిని కొందరు ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు..? చట్టం దుర్వినియోగం కారణంగా మనుషుల జీవితాలు ఎలా బలవుతున్నాయనేది చక్కగా చూపించారు. ఈ సినిమా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయింది.
Also Read : Fake Maize Seeds: రైతన్నకు భరోసా దక్కేనా? ఆశలన్నీ ఆ సమావేశంపైనే!
డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మంగపతిగా శివాజీ తన నట విశ్వరూపం చూపించారు.