HCA SRH Tickets Issue (Image Source: Twitter)
హైదరాబాద్

HCA SRH Tickets Issue: హెచ్ సీఏ, సన్ రైజర్స్ టికెట్ల లొల్లి.. విజిలెన్స్ విచారణతో అసలు నిజాలు బట్టబయలు?

HCA SRH Tickets Issue: హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ (HCA) ​… సన్​ రైజర్స్​ హైదరాబాద్​ మేనేజ్​ మెంట్ (SRH)​ మధ్య తలెత్తిన వివాదంపై విజిలెన్స్​ విచారణ షురూ అయ్యింది. ఉప్పల్ స్టేడియంలోని హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ ఆఫీస్​ కు మంగళవారం ఉదయమే వచ్చిన విజిలెన్స్ అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఐపీఎల్​ టోర్నీకి ముందు జరిగిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు.

ఐపీఎల్​ టోర్నీలో భాగంగా హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచులకు సంబంధించి పెద్ద సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్​ అసోసియేషన్​ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తోందని ఇటీవల సన్​ రైజర్స్​ హైదరాబాద్​ యాజమాన్యం ఆరోపించిన విషయం తెలిసిందే. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్​ విడిచిపెట్టి వెళ్లిపోతామని హెచ్చరికలు కూడా చేసింది. ఈ మేరకు ఓ మెయిల్​ ను విడుదల చేసింది. ఈ వ్యవహారంపై సీరియస్​ అయిన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి విజిలెన్స్​ విచారణకు ఆదేశించారు. టిక్కెట్ల కోసం ఒత్తిడి చేసిన మాట నిజమే అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే విజిలెన్స్​ అధికారుల బృందాలు మంగళవారం ఉదయమే హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ కార్యాలయానికి చేరుకున్నాయి. అప్పటికి అసోసియేషన్​ చెందిన ఎవ్వరూ రాలేదు. దాంతో అందుబాటులో ఉన్న సభ్యులంతా రావాలని సూచించిన విజిలెన్స్​ అధికారులు ఆఫీస్​ లోని కంప్యూటర్​ ను పరిశీలించారు.

హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​…సన్​ రైజర్స్​ హైదరాబాద్​ మేనేజ్​ మెంట్​ మధ్య నడిచిన ఈ మెయిళ్ల వివరాలను తీసుకున్నారు. ఆఫీస్​ లోని రికార్డులను పరిశీలించి కొంత సమాచారాన్ని సేకరించారు. తనిఖీలు కొనసాగుతుండగా హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ సభ్యులు కొందరు అక్కడికి చేరుకున్నారు. వీరి ద్వారా ఐపీఎల్​ టోర్నీ మొదలు కావటానికి ముందు జరిగిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని విజిలెన్స్​ అధికారులు తీసుకున్నారు. గత రెండేళ్లలో ఉప్పల్​ స్టేడియంలో జరిపిన రెన్నోవేషన్స్​ పనులు, వాటికి అయిన ఖర్చుల వివరాలను కూడా సేకరించారు. హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్, సన్​ రైజర్స్​ హైదరాబాద్ మేనేజ్​ మెంట్​ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన ప్రతులను కూడా విజిలెన్స్ అధికారులు తీసుకున్నారు.

ఒకవైపు విజిలెన్స్​ విచారణ మొదలు కాగా మరోవైపు సమస్యను పరిష్కరించుకోవాలని సన్​ రైజర్స్​ హైదరాబాద్​ మేనేజ్​ మెంట్​ నిర్ణయించింది. ఈ క్రమంలో కలిసి కూర్చుని చర్చించుకుందామంటూ హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ కు ఓ మెయిల్​ పంపించింది. ఇప్పటికే కలిసి సమస్యను పరిష్కరించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్టు హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ చెప్పిన విషయం తెలిసిందే. ఇరువైపులా పరిష్కారానికి సిద్దం అన్న సంకేతాలు అందిన నేపథ్యంలో రెండు పక్షాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం.. బుధవారం హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్, సన్​ రైజర్స్​ హైదరాబాద్​ మేనేజ్​ మెంట్​ తో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

ఇప్పటివరకు ఉప్పల్​ లో జరిగిన రెండు మ్యాచ్​ లకు సన్​ రైజర్స్​ హైదరాబాద్​ యాజమాన్యం.. కేవలం 3,800 కాంప్లిమెంటరీ పాస్​ లే ఇచ్చిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అవి కూడా కోశాధికారి శ్రీనివాస్​ కు ఇచ్చారుగానీ అధ్యక్షుడు జగన్మోహన్​ రావుకు కాదని పేర్కొంది. ఎఫ్​ 12ఏ బాక్సులో సామర్థ్యానికి మించి 50 టిక్కెట్లు ఇస్తామని సన్​ రైజర్స్​ యాజమాన్యం చెప్పిందని తెలిపింది. అయితే, కేవలం 30మంది కూర్చోవటానికి మాత్రమే వీలుండటంతో మిగిలిన 20 పాస్​ లను మరో బాక్స్​ లో సర్దుబాటు చేయాలని సూచించినట్టు తెలియచేసింది. గతనెల 27న సన్​ రైజర్స్​ ప్రతినిధులు కిరణ్​, శరవణన్​, రోహిత్​ సురేశ్​ దీనికి అంగీకరించినట్టు పేర్కొంది.

Also Read: Smart Ration Cards AP: కొత్త రేషన్ కార్డులపై అదిరిపోయే అప్ డేట్.. ప్రభుత్వం ప్లాన్ మామూల్గా లేదుగా!

హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్​ అధ్యక్షుడు జగన్మోహన్​ రావు ప్రతీ మ్యాచ్​ కు 10శాతం టిక్కెట్లు బ్లాక్​ చేయమన్నారన్నది నిజం కాదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విజిలెన్స్ అధికారులకు సూచించింది. ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం 10శాతం టిక్కెట్లు బ్లాక్​ చేయాలని అడగలేదని స్పష్టం చేసింది. తమ క్లబ్ సెక్రటరీలకు ఉచిత పాస్​ లు సరిపోక పోతుండటంతో డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనటానికి అవకాశమివ్వాలని అపెక్స్​ కౌన్సిల్​ గతనెల 19న కోరిన విషయాన్నిగుర్తు చేసింది. దీనికి సన్ రైజర్స్​ యాజమాన్యం అంగీకరించి హెచ్​సీఏ అకౌంట్​ నుంచి చెల్లింపులు జరపమని అడిగినట్టు తెలిపింది. దీనికి తాము అంగీకరించలేదని పేర్కొంది. టిక్కెట్లు కొన్నవారు వ్యక్తిగతంగా డబ్బు చెల్లిస్తారని స్పష్టంగా చెప్పినట్టు తెలిపింది.

ఈ టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం పెండింగ్​ లో ఉండగానే జగన్మోహన్​ రావు తన వ్యక్తిగత అవసరాల కోసం 2,500 టిక్కెట్లు బ్లాక్​ చేయాలని అడిగినట్టు దురుద్దేశాలు ఆపాదించటం సమంజసం కాదని పేర్కొంది. స్టేడియం ఆధునీకరణ విషయానికి వస్తే ఆరెంజ్​ కలర్​ సీట్లు వేయించాలని జస్టిస్​ నాగేశ్వరరావుని సన్​ రైజర్స్​ యాజమాన్యం కోరిందని పేర్కొంది. దీని కోసం అయ్యే 8 నుంచి 1‌0‌కోట్ల ఖర్చును సీఎస్​ఆర్​ నిధుల కింద చెల్లిస్తామని కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే, సన్​ రైజర్స్​ యాజమాన్యం ఈ మాటను నిలబెట్టుకోలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే స్టేడియంలో తాజా సీజన్​ ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించాలని సన్​ నెట్​ వర్క్​ ఎండీకి లేఖ కూడా రాశామని HCA తెలియచేసింది. దీనిపై సానుకూలంగా స్పందించి స్టేడియానికి రంగులు వేయటం, కార్పోరేట్​ బాక్సుల ఆధునీకరణ పనులు మీరు చేపట్టగా కొత్త ఏసీల కొనుగోలు, వాటిని ఏర్పాటు చేయించటం తాము చేసినట్టుగా హెచ్​సీఏ తెలిపింది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం