Bigg Boss9 Telugu: తెలుగు బుల్లి తెర టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ దాదాపు చివరి అంకానికి చేరుకుంది. సీజన్ 9 గత వంద రోజులుగా ప్రతి రోజూ ప్రేక్షకులకు వినోదం అందిస్తూనే ఉంది. 102 వ రోజుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్ బాస్ డీమాన్ పవన్ ఈ వంద రోజులు తన ఆటను ఎలా ఆడాడో వివరించడంతో డీమాన్ పవన్ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకూ బిగ్ బాస్ ఏం అన్నారు అంటే.. బిగ్ బాస్ లోకి సామాన్యుడిగా అడుగు పెట్టిన మీరు ఈ బిగ్ బాస్ రణ రంగంలో కాంకరర్గా మారిన మీరు మీ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం. మీరు ఎవరితో పోరాడితే వారి ఆట కకా వికలం. మీకు ఏ గెలుపూ అంత సులువుగా అభించలేదు చమటోర్చి పోరాడితేనే ఫలితం వచ్చింది. స్నేహాన్ని ఆటను బేలన్స్ చేస్తూ బలమైన ప్రత్యర్థిగా మీ అమ్మ ఆసీస్సులతో టాప్ 5 లో ఇప్పుడు ఇలా నిలిచారు. ’ అంటూ బిగ్ బాస్ చెప్పడంతో డీమాన్ ఒక్క సారి ఎమోషనల్ అయ్యాడు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్ కు థేంక్స్ చెప్పాడు.
Read also-Avatar 3 review: ‘అవతార్ 3’ ఫస్ట్ ఇంటర్నేషనల్ రివ్యూ.. అడ్డంగా బుక్కైపోతారట!
ఈ వీడియో చూసిన నెటిజన్లు డీమాన్ పవన్ కు తమ మద్ధతు తెలుపుతున్నారు. నువ్వు చాలా బలంగా ఉండాలి ఎవరిమాటా వినకు అంటూ ఒకరు రాసుకొచ్చారు. డీమాను పవన్ కు అందిరి దిష్టీ తగిలేలా ఉంది కొంచెం జాగ్రత్తగా ఆడు తమ్ముడూ అంటూ ఓ అన్న రాసుకొచ్చారు. ఇలా ప్రేక్షకుల నుంచి కూడా డీమాన్ పవన్ కు మద్ధతు చేకూరుతుంది. దేవుడు ఎలా అయినా పవన్ ను విన్నర్ను చెయ్యి అంటూ ఒకరు ఆ దేవుడిని ప్రార్థించారు. ఏది ఏమైనా డీమాన్ కు ప్రేక్షకుల నుంచి వచ్చే మద్ధతు చూస్తే విన్నర్ అయిపోయే అవకాశం ఉంది.. అయితే విన్నర్ ఎవరో తెలియాలి అంటే మాత్రం కేవవల రోజులు మాత్రమే వేచి ఉండాల్సింది.
Read also-Ravi Teja: రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే?

