Bigg Boss9 Telugu: బుల్లి తెర ప్రేక్షకులను గత 104 రోజులుగా రియాలిటీ ఎంటర్టైన్ మెంట్ అందిస్తూ.. వారికి ఏంతో సంతోషాన్ని పంచింది. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు అందరూ ఆతురతగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి సంబంధించిన 104వ రోజు ప్రోమో విడుదలైంది. ముఖ్య అతిథులుగా ఈ ప్రోమోలో టాలీవుడ్ సీనియర్ నటులు శివాజీ, లయ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరూ కలిసి నటించిన ‘మిస్సమ్మ’ సినిమాలోని మ్యాజిక్‌ను మరోసారి స్టేజ్‌పై గుర్తుచేశారు. శివాజీ, లయ తమదైన శైలిలో ఇంటి సభ్యులను అలరించడానికి హౌస్‌లోకి వచ్చారు. వీరి రాకతో ఇంట్లో నవ్వులు పూశాయి. ఇంటి సభ్యులతో కలిసి వీరు కొన్ని సరదా టాస్కులు నిర్వహించారు. శివాజీ తనదైన టైమింగ్‌తో అందరినీ నవ్వించగా, లయ తన డ్యాన్స్ చలాకీతనంతో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ అంతా కంటెస్టెంట్లకు కాస్త ఉపశమనాన్ని ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేలా రూపొందించబడింది. మొత్తానికి, 104వ రోజు ఎపిసోడ్ పాత స్నేహితుల కలయికతో స్వచ్ఛమైన వినోదంతో నిండి ఉన్నట్లు ఈ ప్రోమో స్పష్టం చేస్తోంది.
Read also-Dandora Movie Trailer: శివాజీ ‘దండోరా’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ మత్తు దిగాలంటే టైమ్ పట్టుద్ది సార్..
సాధారణంగా ఫినాలేకు ముందు కంటెస్టెంట్లు ఎంతో ఆందోళనగా ఉంటారు. కానీ ఈ ఎపిసోడ్ వారిని ఆ ఒత్తిడి నుంచి దూరం చేసి, స్వచ్ఛమైన వినోదాన్ని పంచింది. పాత స్నేహితుల కలయిక, సరదా ఆటలు, పాటలతో 104వ రోజు ఎపిసోడ్ ఒక మెమోరబుల్ ఈవెంట్‌గా నిలిచిందని ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. మొత్తానికి 104 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, రేపు జరగబోయే గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సీజన్ 9 విజేత కిరీటాన్ని ఎవరు అందుకుంటారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రియాలిటీ షోలో కళ్యాణ్ విన్నర్ అవుతారని అందరూ బావిస్తున్నారు. తనూజ, పవన్, ఇమ్మానియేల్, సంజన తర్వాత స్థానాల్లో ఉంటారని బిగ్ బాస్ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకొక్క రోజు మాత్రం వేచి ఉండాంల్సిందే.
Read also-BMW Teaser: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేసింది.. ఫ్యామిలీ టచ్ అదిరిందిగా..

