Allu Shrish – Rohit Sharma: అల్లు అర్జున్ శిరీష్ చిన్న నాటి నుంచీ ఎలా ఉండేవారో చాల సందర్భాలలో బన్నీ ప్రస్తావించారు. అయితే అందులో ఏం ఉందిలే అనుకుంటే పొరపాటే చిన్నప్పుడు వారు చాలా సార్లు కొట్టుకున్నా వారిద్దరిలో ఎవరు ఎదుగుతున్నా మిగిలిన వారికి చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటి సందర్భమే ఇప్పుడు అల్లు అర్జున్ వంతు అయింది. అల్లు శిరీష్ చేసిన ఓ యాడ్ చూసి అల్లు అర్జున్ తెగ సంబర పడిపోతున్నారు. ఎందుకంటే అల్లు శిరీష్ తో పాటు ఇండియన్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా అందులో ఉన్నారు. దీంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ యాడ్ కి లో రోహిత్ శర్మ, అల్లు శిరీష్ కలిసి కనిపించారు. ఇది చూసిన బన్నీ ఈ ఆనంద సమయాన్ని అందరితో పంచుకోవాలంటూ దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన అల్లు శిరీష్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read also-Decoit Teaser Review: అడవి శెష్ ‘డెకాయిట్’ టీజర్ చూశారా.. ఇరగదీశాడుగా..
అల్లు శిరీష్ ఒక్క సారి అలా చూసిన అల్లు అర్జున్ తన ట్విటర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. వావ్ ఇది నేను ఊహించలేదు శిరీష్. చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వంగా కూడా ఉంది. ఒక దిగ్గజ క్రికెటర్ తో స్కీన్ షేర్ చేసుకోవడం అంటే మామోలు విషయం కాదు దీనికి నేను చాలా సంతో షిస్తున్నాను. నిజంగా చాలా హృదయ పూర్వకంగా చాలా సంతోష పడుతున్నాను. అంతే కాకుండా నీతో కలిసి నటించిన స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. దీనిని చూసిన అల్లు ఫ్యాన్ తెగ సంబరపడిపోతున్నారు. ఇలాంటి దిగ్గజ వ్యక్తులతో కలిసి మరెన్నో సన్నివేశాలు కలిసి నటించాలని శిరీష్ అభిమానులు కోరుకుంటున్నారు.

