Actor Robo Shankar ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Actor Robo Shankar: ప్రముఖ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూత

Actor Robo Shankar: ప్రముఖ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ (46) సెప్టెంబర్ 18, 2025న చెన్నైలోని జీఈఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలు, పచ్చకామెర్లతో బాధపడుతూ ఉన్న ఆయన, సినిమా షూటింగ్ సమయంలో స్పృహతప్పి పడిపోయారు. ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ, జీర్ణాశయంలో రక్తస్రావం, అవయవాల వైఫల్యం కారణంగా మరణించారు.

Also Read: Bandla Ganesh: ఈ మాఫియా నిన్ను బతకనివ్వదు.. లిటిల్ హార్ట్స్ హీరోకి సినిమా పాఠాలు నేర్పిస్తున్న బండ్ల గణేష్?

ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని వలసరవక్కంలోని నివాసానికి తరలించారు. అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. రోబో శంకర్ ‘మారి’, ‘విశ్వాసం’, ‘పులి’, ‘సింగం 3’, ‘కోబ్రా’ వంటి చిత్రాల్లో నటించి, తన విలక్షణ హాస్యంతో తమిళ, తెలుగు ఆడియెన్స్ ను అలరించారు. స్టాండప్ కమెడియన్‌గా, టీవీ షోల ద్వారా గుర్తింపు పొంది, రోబోట్‌లా నృత్యం చేయడం వల్ల ‘రోబో’ శంకర్‌గా ప్రసిద్ధి చెందారు. ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కమల్ హాసన్, ధనుష్, వరలక్ష్మీ శరత్ కుమార్, వెంకట్ ప్రభు వంటి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ భావోద్వేగ సందేశంలో రోబో శంకర్‌ను ‘తమ్ముడు’గా పేర్కొన్నారు. రోబో శంకర్‌కు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు, వీరిద్దరూ సినిమాల్లో నటించారు.

Also Read: Mahavatar Narsimha OTT: ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’.. ఈ సడెన్ ట్విస్ట్ ఏంటి?

Just In

01

Kunamneni Sambasiva Rao: పేద ధనిక అంతరాలను తొలగించే ఏకైక మార్గం సోషలిజమే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Bihar Exit Polls: బీహార్‌‌లో మళ్లీ ఎన్డీయే!.. ఘంటాపథంగా చెబుతున్న ఎగ్జిట్ పోల్స్.. సీట్ల అంచనాలు ఇవే

Bigg Boss Promo: గెలుపు నిర్ణయంలో మహారాజుపై ఫైర్ అవుతున్న తనూజా.. ఏం కిక్ ఉంది మామా..

Thummala Nageswara Rao: ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలువాలి.. అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల

Dharmapuri Arvind: కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదు : ఎంపీ అరవింద్