The Girlfriend: రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమా నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా కంటెంట్‌కు మరియు రష్మిక నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 12, 2025న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విడుదలైనప్పటి నుంచీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఆడవారి నుంచి పెద్దల నుంచి ఈ సినిమాకు ప్రత్యేక మద్దతు లభిస్తుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో నిర్మాతలు సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు.
Read also-Gopigalla Goa Trip movie: ‘గోపిగాళ్ల గోవా ట్రిప్’లో ఏం జరిగిందో తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే..
ఈ విజయోత్సవ వేడుకకు యువ సంచలనం విజయ్ దేవరకొండ ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. రష్మిక మందన్నకు, విజయ్ దేవరకొండకు మధ్య ఉన్న మంచి అనుబంధం, వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ల నేపథ్యంలో, విజయ్ దేవరకొండ హాజరు కావడం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అంతే కాకుండా వీరిద్దరికీ ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా అయింది. దీంతో విజయ్ రాకతో, సినిమా విజయం గురించి మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Read also-12A Railway Colony: అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సమర్పణలో, విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న సానుకూల స్పందన, ముఖ్యంగా రష్మిక నటనకు వస్తున్న ప్రశంసలు యూనిట్‌కు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ విజయోత్సవ వేడుక ద్వారా, సినిమా గురించి మరిన్ని విశేషాలు పంచుకోవడానికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొని, సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకునే అవకాశం ఉంది. ఈ వేడుక సినిమా విజయాన్ని మరింత పెంచేలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
#TheGirlfriend success celebrations tomorrow (12th November) from 6 PM onwards at Park Hyatt, Hyderabad ❤🔥
Book your tickets for THE BEST TELUGU FILM OF THE YEAR now!
🎟️ – https://t.co/aASxyrtyIG pic.twitter.com/BlWp50ki0W
— Geetha Arts (@GeethaArts) November 11, 2025
