Dharmapuri Arvind: కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ విమర్శించారు. జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంఖ్య లేకుండా చేసుకుని కేంద్రం నుంచి వచ్చిన నిధులను సద్వినియగం చేయలేదు. కేసీఆర్ నేర్పిన ఆ దరిద్రపు ఆలోచనను అమలు చేస్తే మంచిది కాదు.
Also Read: Dharmapuri Arvind: నిజామాబాద్‌లో పొలిటికల్ లీడర్ల పేకాట అడ్డాలు.. వార్నింగ్ ఇచ్చిన ఎంపి అరవింద్
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం
ఇప్పుడున్న రాష్ట్రం ప్రభుత్వం అయిన అలాంటి ఆలోచనలు మానుకుని కేంద్రంతో సఖ్యతగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియగం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. రేషన్ బియ్యం పంపిణీ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంటే ప్రధాన మంత్రి ఫోటో పెట్టకుండా సీఎం ఫోటో, బట్టి గారి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఓ సంచులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలకు నష్టం కలిగే పనులు
ఉత్తం కుమార్ రెడ్డి అంత కరప్షన్ మంత్రి ఎవరు లేరు అని ఆరోపించారు. జగిత్యాలకు కేంద్ర విద్యాలయం మంజూరు చేసినా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి భూమి కేటాయించడం లేదని ఆయనకు ఏమన్నా కమిషన్ కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రజలకు నష్టం కలిగే పనులు మాని ఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులు అయిన అది ప్రజల సొమ్మే కాబట్టి ప్రజలకు మేలు చేసేందుకు నిధులు సద్వినియోగం చేయాలని అరవింద్ సూచించారు.
Also Read: MP Dharmapuri Arvind: సోషల్ మీడియాలో మంత్రి పోస్ట్ వైరల్.. కారణం అదేనా!
