MP Dharmapuri Arvind (imagcredit:twitter)
Politics

MP Dharmapuri Arvind: సోషల్ మీడియాలో మంత్రి పోస్ట్ వైరల్.. కారణం అదేనా!

MP Dharmapuri Arvind: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఫైర్ బ్రాండ్ రెండుసార్లు ఎంపీ పసుపు బోర్డు సాధించిన ఘనతతో పదవి దక్కుతుందని ఆశించిన ఆయనకు నిరాశ కలిగిందట. అంతర్ మదనం బయట అధ్యక్షుడు నిర్ణయంపై తుది నిర్ణయం అధిష్టానందే అని చెప్పిన లోలో పల మాత్రం పార్టీకి ఇంత చేసిన ప్రతిపక్ష పార్టీలపై పార్టీపై వచ్చిన నిందలను కొట్టివేస్తూ రాష్ట్రంలోనే ఒక ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి దక్కకపోవడంతో పార్టీపై అలకతో ఉన్నారని ఆ పార్లమెంట్‌లో ఫైర్ బ్రాండ్ లాగే ఫైర్‌గా చర్చ జరుగుతుందట అసలు ఆ ఎంపీ ఎవరు ఎందుకు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన మేసేజ్ ఏంది?

రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఎంపీ

నిజామాబాద్ పార్లమెంటు బిజెపి ఎంపీ అయిన ధర్మపురి(MP Aravind) రెండుసార్లు ఎంపీగా గెలిచి రాష్ట్ర రాజకీయాలను తిప్పి చూసేలా తన రాజకీయ చతురస్రాన్ని సక్సెస్ చేశారు. ఇటీవల చిరకాల పసుపు రైతుల కోరిక అయిన పసుపు బోర్డు తీసుకొచ్చి నిజామాబా‌ద్‌లో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేసి కేంద్ర హోంశాఖ మంత్రి ప్రారంభించి పసుపు రైతులు బిజెపి(BJP) రాష్ట్ర పార్టీకి ఆ ఒక బ్రాండ్‌గా నిలిచారు. కానీ మొదటినుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఎంపీ అరవింద్ ఇప్పుడు ఆ పదవి దక్కకపోవడంతో ఎప్పుడు లేని సోషల్ మీడియాలో నిరంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు లేదా తన మీడియా సమావేశాలు లేదా ప్రతిపక్ష పార్టీలపై దాని ధ్వజమెత్తుల పోస్ట్లు పెట్టేవారు.

ఇప్పుడు ఆయన పెట్టిన మెసేజ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీ అంశం అవుతుంది. అదే మేసేజ్ ఏంటంటే due to personal reasons, I will not attend the state party events అంటూ పెట్టిన పోస్ట్‌తో తాను అలిగారా లేదా నిజంగానే పర్సనల్ రిజన్స్ ఉన్నాయా అంటూ సోషల్ మీడియా(Social Media)లో తెగ చక్కర్లు కొడుతుంది ఈ మేసేజ్. ఒకవేళ ఆ మెసేజ్ రూపంగా చెప్పాలి అనుకుంటే అధిష్టానానికి తాను మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేసి చెప్పవచ్చు అంతే కానీ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల తన కేడర్కు బిజెపి(BJP) నేతలకు నూతన అధ్యక్షుడు ఎన్నుకోవడంలో రాజాసింగ్(Raja Singh) లాంటివారు డైరెక్ట్ చెప్పినప్పటికీ, ఎంపీ అరవింద్ మాత్రం ఇలా మేసేజ్ రూపంలో నిరసన తెలిపారు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Bandi Sanjay: బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా?.. బండి సంజయ్ కీలక వాఖ్యలు!

రామచంద్ర రావు వైపు ఢిల్లీ పెద్దలు మొగ్గు

చివరి దాక బీజేపీ తెలంగాణ(Telangana) కొత్త అధ్యక్షుడి రేసులో ఉన్న ఎంపీ అర్విందు అవకాశం దక్కలేదు. ఈసారి కూడా ఆయన కు అవకాశం చేజారింది. ఈసారి కూడా సీనియర్ నేత రామచంద్ర రావు(Ramchendhra Rao)కు పగ్గాలు అప్పగించారు. ఇందులో భాగంగా సీనియర్ నేత రామచంద్ర రావు వైపు ఢిల్లీ(Delhi) పెద్దలు మొగ్గు చూపారు. బీసీ(BC) వర్గాలకే పగ్గాలు అప్పగించబోతు న్నారంటూ జరిగిన ప్రచారం నేపథ్యంలో ఎంపీలు ఈటెల రాజేందర్(Eatala Rajendar), ధర్మపురి అర్వింద్‌లపేర్లు తుది పరిశీలనకు వచ్చాయి. అమిత్ షా(Amit Shah) నిజామాబాద్ పర్యటన సూపర్ సక్సెస్ అయినా సంబరాల్లో ఉన్న కాషాయం శ్రేణులు అర్వింద్‌కు అధ్యక్ష పదవి గంపెడు ఆశలతో ఉండే, ఆయనకే ఖరారు కాబోతుందని అమిత్ షా సభ కు వచ్చిన నేతలు ధీమాతో ఉండే. పై అధిష్టానం సుదీర్ఘ కసరత్తులు చేసింది. పార్టీ వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపింది. అధ్యక్ష పదవీ కోసం అరడజన్ మంది ఆశిస్తున్నట్లు అంచనాకు వచ్చింది.

దూరంపెట్టి తన రాజకీయ పరిచయాలు

వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నబీజేపీ(BJP) బీసీ(BC) ఫార్ములా తెరమీదికి తెచ్చింది. బిసి వర్గాలకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావించింది. దీనితో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న అర్వింద్ను RSS సైతం వెన్నుతట్టింది. మరో వైపు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు సైతం తుది పరిశీలనకుచేరింది. అయితే పార్లమెంట్ స్థాయిలో సీనియర్ బిజెపి నాయకులు అరవింద్ వచ్చాక సీనియర్లను పట్టించుకోకపోవడం, ఆ గాడును దూరం పెట్టి తన రాజకీయ పరిచయాలు మున్నూరు కాపు సామాజిక వర్గం, తండ్రి డి శ్రీనివాస్(Srinivass)తో పని చేసిన అనుభవం ఆయనకు అనుకూలంగా ఉన్న నేతలను ముందుకు తీసుకొచ్చి సీనియర్లను పక్కనపెట్టి కొత్త క్యాడర్కు సపోర్ట్ చేయడం ఇలాంటి చాలావరకు పరిణామాలు ఎంపీ అరవింద్(MP Aravindh) అధ్యక్ష పదవికి అడ్డుపడినది సీనియర్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

Also Read: Gadwal News: కొడుకులు అన్నం పెట్టడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తల్లి

వారి మాటల్లో లుకలుకలు

ఈటెలకు పగ్గాలు అప్పగించడానికి RSS నుంచి ప్రతిఘటన ఎదురైంది. అర్వింద్ ఈటెలకు అధ్యక్ష పదవి రేసులో రావడంతో తెలంగాణ బీజేపీ(Telangana BJP) సీనియర్లు ఏకం అయ్యారు అంత కలసి కట్టుగా సంఘ్ పెద్దలతో పాటు ఢిల్లీ పెద్దలను ఆశ్రయించి సీనియర్లలో ఒకరి పేరును పరిశీలించాలని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలోనే రామచంద్ర రావు(Ramchendhra Rao) పేరు తెరమీదికి వచ్చింది. ఇందుకు మాజీ ఎమ్మెల్యే జిల్లా సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ(Laxmi Narayana) పాత్ర కూడా ఉందనేది ఒక వైపు జరుగుతున్న చర్చా అలాగే ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపింది అనేది పార్టీలో సీనియర్ వర్గం వారి మాటల్లో లుకలుకలు. ఇద్దరు కేంద్ర మంత్రులు సైతంసై అనడంతో అధ్యక్షుడి కోసం మొదలైన సుదీర్ఘ కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. ఈసారి కూడా అధ్యక్ష పదవి అర్వింద్ చేజారింది. అమిత్ షా టూర్ తో జోష్‌లో ఉన్న ఆయన వర్గీయులు ఒక్కసారిగా డీలా పడ్డారా ఆంటే ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో లోలోపల అవుననే అనుకుంటున్నారట చూడాలి ఎంపీ అరవింద్ నీ ఎలా బుజ్జగిస్తారో లేదా ఏదైనా బాధ్యతలు అప్పగిస్తారో వేచి చూడాలి.

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?