Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ది రాజాసాబ్’ (The Raja Saab), ‘ఫౌజి’ (Fauji) షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రెబల్ స్టార్ (Rebel Star).. ఆ వెంటనే ‘స్పిరిట్’ చిత్రంతో బిజీ కానున్నారు. ఇంకా ‘కల్కి 2’, ‘సలార్ 2’ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఆయన కోసం క్యూలో ఉన్నాయి. ‘ది రాజా సాబ్’ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను రాబోయే సంక్రాంతి బరిలో దించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో కలిసి ‘ఫౌజి’ (ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు) ప్రాజెక్ట్‌తో ఆయన బిజీబిజీగా ఉన్నారు. ఈ పీరియాడిక్ ఎపిక్ చిత్రంలో ప్రభాస్ ఓ శక్తివంతమైన సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా టాలీవుడ్ సర్కిల్‌లో ఓ వార్త బాగా హైలెట్ అవుతోంది. అదేంటంటే..
Also Read- Ameesha Patel: వారితో డేటింగ్‌కు రెడీ అంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్!.. కారణం ఇదేనా..
తండ్రీ కొడుకులతో..
రోజురోజుకూ భారీగా అంచనాలను పెంచేసుకుంటున్న ‘ఫౌజి’ సినిమాతో మరో బాలీవుడ్ స్టార్ టాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఆ స్టార్ ఎవరో కాదు.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) అని అంటున్నారు. ‘కల్కి 2898 AD’ చిత్రంలో తండ్రి బిగ్ బితో కలిసి నటించిన ప్రభాస్.. ఇప్పుడు ‘ఫౌజి’తో ఆయన కుమారుడు అభిషేక్‌తో కలిసి నటించనున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్స్ ఎందరో సౌత్‌లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. కానీ టాలీవుడ్ మాత్రం, ప్రపంచ సినిమాను శాసించేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు బాలీవుడ్‌కు వెళ్లాలని అందరికీ ఆశ ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ నుంచే టాలీవుడ్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషమనే చెప్పుకోవాలి.
Also Read- Sai Durgha Tej: నేను తాగను.. నా ఫ్రెండ్స్ నన్ను పార్టీకి ఎందుకు పిలుస్తారంటే?
‘సీతా రామం’ సుమంత్ తరహా పాత్రలో..
ఇక ‘ఫౌజి’లో అభిషేక్ బచ్చన్ పాత్రకు సంబంధించి కూడా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ‘సీతా రామం’ సినిమాలో సుమంత్ పాత్రకు ఎంత విశిష్టత ఉందో.. అంతకంటే గొప్పగా ‘ఫౌజి’లో అభిషేక్ రోల్ ఉంటుందని అంటున్నారు. ఆల్రెడీ అభిషేక్ బచ్చన్‌ను సంప్రదించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని ఆ పాత్ర అభిషేక్ బచ్చన్ చేస్తే చాలా బాగుంటుందని భావించి, దర్శకుడు హను రాఘవపూడి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ పాత్రను అభిషేక్ తన నటనతో చాలా సులభంగా పోషించగలరనే నమ్మకంతో చిత్ర బృందం ఆయనకు కథను వినిపించిందని తెలుస్తోంది. అయితే, ఈ ఆఫర్‌పై అభిషేక్ బచ్చన్ ఇంకా తన తుది నిర్ణయం చెప్పలేదని అంటున్నారు. ఒకవేళ అభిషేక్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తే మాత్రం, టాలీవుడ్‌లో ఇది అతనికి తొలి చిత్రం అవుతుంది. ఇదిలా ఉంటే, ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగా ఇది నిజమైతే మాత్రం.. ప్రభాస్, అభిషేక్ బచ్చన్ వంటి అగ్ర నటులు ఒకే చిత్రంలో నటిస్తే, అది ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు