Hyderabad Crime (* IMAGE credit: twitter)
క్రైమ్, హైదరాబాద్

Hyderabad Crime: మద్యానికి బానిసై.. బ్లేడుతో భార్య గొంతు కోసి?

Hyderabad Crime:  మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి తాను చెప్పినట్టుగా వినటం లేదని బ్లేడుతో భార్య గొంతు కోశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగోల్ ప్రాంతంలో నివాసముంటున్న వేణుగోపాల్ వివాహం గత సంవత్సరం ఆగస్టులో ఒంగోలుకు చెందిన మహాలక్ష్మి (19)తో జరిగింది. పెళ్లయిన తరువాత మొదటి రెండు మూడు నెలలు వీరి కాపురం సవ్యంగానే సాగింది.

 Also Read: New Sports Policy: క్రీడాకారులకు గుడ్ న్యూస్.. నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు నిర్మాణం.. ఎప్పుడంటే..?

వేణుగోపాల్ ఆమెతో గొడవ

ఆ తరువాత వేణుగోపాల్​ మద్యానికి బానిసగా మారటంతో సమస్యలు మొదలయ్యాయి. తాగుడు కోసం వేణుగోపాల్ నగలను అమ్మేస్తుండటంతో మహాలక్ష్మి కొంత బంగారాన్ని పుట్టింట్లో దాచి పెట్టుకుంది. కొన్ని రోజులుగా ఈ బంగారాన్ని తీసుకు రమ్మనమని వేణుగోపాల్ భార్యను వేధిస్తున్నాడు. అయితే, మహాలక్ష్మి నిరాకరిస్తూ వస్తోంది. బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం ఉండటంతో వెళదామని మహాలక్ష్మి భర్తతో చెప్పింది. నగలు లేకుండా ఎలా వెళతామంటూ వేణుగోపాల్ ఆమెతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా బ్లేడుతో మహాలక్ష్మి గొంతు కోశాడు. బాధితురాలు పెట్టిన కేకలు విని అక్కడకు వచ్చిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకే కేసులు నమోదు చేసి నాగోల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Also Read: Donald Trump: తల నరికి భారతీయుడి హత్య.. ట్రంప్ రియాక్షన్ చూశారా.. అస్సలు ఊహించలేరు!

మద్యం సేవించి లారీ నడిపి బీభత్సం సృష్టించిన డ్రైవర్

మద్యం సేవించి లారీ నడిపి ఓ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోకి వచ్చిన పోలీసులను తప్పించుకునేందుకు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. లారీ మహారాష్ట్ర నుంచి కోళ్ళ దాన లోడుతో ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్యంతో డివైడర్‌ను ఢీకొట్టి, ఎదురుగా ఉన్న డైరీ పార్లర్‌లోకి దూసుకెళ్లింది. పోలీసుల చాకచక్యంతో ప్రాణాపాయం తప్పించారు. వరంగల్ ట్రాఫిక్ సీఐ కే. సుజాత తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నుంచి కోళ్ళ దాన లోడుతో ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న లారీ డ్రైవర్ దాసు మద్యం సేవించి లారీ నడిపి వరంగల్‌లో బీభత్సం సృష్టించాడు. నగర శివారు కొత్తపేట మీదుగా వెళ్లాల్సిన లారీ, ములుగు రోడ్డు హనుమాన్ జంక్షన్‌కు రాగానే ట్రాఫిక్ పోలీసులు గమనించారు.

వారిని తప్పించుకొని ఆటోనగర్ మీదుగా ఎంజీఎం కూడలి వద్ద డివైడర్‌ను ఢీకొట్టి, ఎదురుగా ఉన్న డైరీ పార్లర్‌లోకి దూసుకెల్లాడు. పోలీస్ సిబ్బంది ముందుగానే తేరుకుని చాకచక్యంగా వ్యవహరించి జెమినీ థియేటర్, పోచమ్మ మైదాన్ నుంచి వచ్చే వాహనాలకు సిగ్నల్ వేసి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదం తర్వాత లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని సిఐ పేర్కొన్నారు. మద్యం సేవించి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ దాసును, లారీని మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు అప్పగించామని సీఐ తెలిపారు.

Nilakhi Patra: సొంత బండి లేదు ఆడపిల్లకి.. ఆ ఒక్క డైలాగ్ తో హీరోయిన్ అదరగొట్టేసిందిగా..!

Just In

01

Cold Wave Weather: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి

Ganja Smuggling: ఆలయం సమీపంలో గంజాయి విక్రయాలు.. ముగ్గురి అరెస్ట్​

Hesham Abdul Wahab: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి నాకు స్ఫూర్తినిచ్చిన అంశమదే!

Gold Shop Scams: బంగారం షాపులపై నిఘా ఏదీ?.. గుట్టుచప్పుడుకాకుండా ఏం చేస్తున్నారో తెలుసా?

Konda Reddy Arrest Case: వైసీపీ విద్యార్థి నేత అరెస్టుపై ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్