Where Is The Kalki Event
Cinema

Kalki 2898AD: కల్కి 2898 ఏడీ ఈవెంట్‌ ఎక్కడంటే..? 

Where Is The Kalki Event?: డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన తాజా మూవీ కల్కి 2898 AD.ఈ మూవీ కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్‌, ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ కాస్ట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతున్నట్టు మూవీ యూనిట్ అనౌన్స్‌ చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలు రావడంతో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆడియెన్స్‌లో నెలకొన్నాయి. ఇటీవల కల్కి మూవీ నుంచి ప్రభాస్ బుజ్జిని రిలీజ్ చేస్తామని ప్రకటించి ఓ రోబో ఉన్న వీడియోని రిలీజ్ చేశారు.

ఓ చిన్ని రోబోకి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ చెప్పిన వీడియో రిలీజ్ చేయగా అది నెట్టింట వైరల్ అయింది. అసలు కల్కి మూవీలో భైరవ బుజ్జి ఎవరో మే 22న చెప్తామని తెలిపింది మూవీ యూనిట్. తాజాగా దీనికి సంబంధించిన ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ చేశారు. మే 22న హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో సాయంత్రం 5 గంటల నుండి భారీ వేడుకను నిర్వహించబోతున్నారు కల్కి టీం.

Also Read:ఆ రోల్‌ కోసం రియల్‌ గోల్డ్‌..! 

ఇప్పటికే అక్కడ స్టేజి సెట్టింగ్ రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ వేడుకల్లో బుజ్జి రోల్‌ని ఇంట్రడ్యూస్‌ చేయబోతున్నారు. బుజ్జి అంటే మూవీలో ప్రభాస్ పాత్ర వాడే వాహనం అని తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేడు రామోజీ ఫిలింసిటీకి ప్రభాస్ ఫ్యాన్స్‌ భారీగా వెళ్లనున్నారు. కల్కి మూవీ మొదలు పెట్టినప్పటినుంచి ఇండియాలో చేసే మొదటి ఈవెంట్ ఇదే కావడంతో ఈవెంట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్‌కి డార్లింగ్‌ ప్రభాస్‌తో పాటు మూవీ యూనిట్ అంతా వస్తారని సమాచారం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!