Tollywood Hero Siddu Jonnalagadda Act In Devara Movie: టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ అనే దానికంటే టిల్లుగాడు అంటే బెటర్ ఏమో.. ఎందుకంటే తాజాగా రిలీజైన టిల్లు స్క్వేర్‌తో భారీ హిట్‌ని అందుకొని జనాల నోట టిల్లుగాడు అనిపించుకుంటున్నాడు. అంతేకాదు భారీగా వస్తోన్న కలెక్షన్స్‌తో అట్లుంటది మనతోని అన్నట్లుగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లోకి తన టిల్లు మూవీతో ఎంట్రీ కూడా ఇచ్చేలాగా ఉన్నాడు.
అలాంటి ఈ స్టార్ హీరో ఇప్పుడో బంపర్ ఆపర్ అందుకున్నాడు. అయితే ఆఫర్ ఎవరు ఇచ్చిందో కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చింది. ఎస్! అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్.. సిద్దు జొన్నల గడ్డ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల డైరెక్షన్‌లో వస్తోన్న అప్‌కమింగ్ ఫిల్మ్ దేవరలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చే ఛాన్సుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కి క్రేజీ అప్‌డేట్..!
ఇక రీసెంట్‌గా టిల్లు మూవీని సిద్ధు.. నాగవంశీ, విశ్వక్ సేన్‌తో కలిసి రీసెంట్‌గా చూసిన యంగ్ టైగర్, టిల్లు స్క్వేర్‌ను విపరీతంగా ఎంజాయ్ చేశారట. ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్దును అప్రిషియేట్ కూడా చేశారట. అయితే అప్రిషియేట్ చేయడం మాత్రమే కాదు. వీలుంటే దేవరలో క్యామియో చేయాలని అడిగారట. దీంతో సిద్దు కూడా చాలా ఎగ్‌జైట్ అయ్యారని, లేట్ చేయకుండా టక్కున ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. మరి వీరిద్దరుంటే మినిమం ఉంటుందని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారట.