Kalki 2898 AD Movie New Release Date Locked Movie Unit: పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్‌హాసన్, హీరోయిన్లు దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ రోల్‌లో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్రయూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.
కానీ పద్మావతి రోల్‌లో దీపికా పదుకోన్, అశ్వత్థామ రోల్‌లో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 9న రిలీజ్ కావాల్సింది. కానీ ఆ టైంలో ఎన్నికల కారణంగా ఈ మూవీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడం.. ఆ టైంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ఉండటంతో దాదాపు ఈ పాన్ ఇండియా మూవీని వాయిదా వేస్తారని తెలుస్తోంది. కల్కి వాయిదా పడుతుందని భారీగానే వార్తలు వచ్చాయి.
Also Read:ఫ్యామిలీ స్టార్ మూవీపై నాగచైతన్య ఫ్యాన్స్ ఖుషీ, రీజన్ అదేనట..!
కానీ మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంతలో ఫ్యాన్స్ కోసం ఓ శుభవార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మే 9న రిలీజ్ కావాల్సిన కల్కి..మే 30న రిలీజ్ కానున్నట్లు నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతుంది. ఈ మేరకు మూవీ యూనిట్ కూడా త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీలో లీడ్ రోల్స్‌లో కనిపించే ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్‌ల పాత్రలకు సంబంధించిన పూర్వాపరాలను, ఆ పాత్రల తీరు తెన్నులను చెబుతూ ఓ యానిమేటేడ్ వీడియోను రెడీ చేస్తున్నారట. అది డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. అదే టైంలో కల్కి రిలీజ్ డేట్‌ని ఫైనల్ చేస్తారట. ఇక ఇదే విషయంపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.