Game changer pre-release overseas deal close
Cinema

Tollywood News: మూవీపై క్లారిటీ

Shankar Clarifies About Game Changer Remaining Shoot:టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి గేమ్‌ఛేంజర్‌. స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాంచరణ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది.

కాగా ఈ చిత్రం చాలాకాలం నుంచి షూటింగ్‌ జరుపుకుంటుందని తెలిసిందే. ఇంతకీ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో.. కొత్త అప్‌డేట్స్‌ ఎప్పుడు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం శంకర్ కాంపౌండ్ నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ ఇంకా 10-15 రోజులు మాత్రమే మిగిలి ఉందని శంకర్‌ చెప్పాడు. ఇండియన్ 2 విడుదలవగానే వీలైనంత త్వరగా గేమ్‌ ఛేంజర్‌ను పూర్తి చేస్తానని చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ మూవీలో సునీల్, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్లర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: లక్కీ ఛాన్స్ వన్స్‌ మోర్‌

గేమ్‌ఛేంజర్‌లో రాంచరణ్‌ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌.. కాగా తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుంది.ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.