Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన రాబోయే సినిమాల కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూశారో.. అంతకు మించిన ఆతృతతో డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకునే ఘట్టం కోసం వేచి చూశారు. రెండింటిలో విశేష ఆదరణ ఉన్నప్పటికీ రెంటినీ బ్యాలెన్స్ చేయడం సులువేమీ కాదు. కాబట్టి, పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
డిప్యూటీ సీఎం అయ్యాక సినిమా చేసే టైమ్ ఉంటుందా? అందుకే సినీ నిర్మాతలను క్షమించాలని కోరాను అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో కోరారు. మూడు నెలల తర్వాత వీలు చిక్కినప్పుడు 2 నుంచి 3 రోజులు సినిమాలు చేస్తానని వివరించారు. ప్రజా సేవ చేయాల్సిన ఉన్నత పదవిలో ఉన్నప్పుడు మనం OG అంటే ప్రజలు క్యాజీ అంటారని పేర్కొన్నారు. కాబట్టి, ఈ మూడు నెలలపాటు తాను షూటింగ్‌కు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.
కుదిరినప్పుడు మూడు రోజులు షూటింగ్‌కు వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే నిర్మాతలను క్షమాపణలు కోరుతానని వివరించారు. నిర్మాతలు ఆ మేరకు అడ్జస్ట్ చేసుకోవాలని సూచించారు.
ఓజీ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లు ఇది వరకే బయటకు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్, మేనరిజం అందరినీ ఆకట్టుకుంటున్నది. పవర్ ఫుల్ రోల్‌లో పవన్ కళ్యాణ్ కనిపించనుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇంతలో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో బిజీ అయ్యారు. ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించారు. ఫస్ట్ టైమ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. నేరుగా డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో సహజంగానే బాధ్యతలు కూడా పెరిగాయి. ఫలితంగా సినిమాలకు కొంత కాలం గ్యాప్ ప్రకటించారు.