– కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు?
– ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు
– పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి
Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారగా, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయన్నారు. తమకైతే ఏకాభిప్రాయం ఉందని, ఎందుకు ఆలస్యం అవుతుందో ఏఐసీసీ పెద్దలనే అడగాలని చెప్పారు. విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం అవుతున్నట్టు చెప్పారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ విషయాన్ని కేంద్ర పెద్దలకు వివరించినట్టు తెలిపారు. గతంలో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల రాజేందర్ ఎక్కడున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆయనకు కేసీఆర్‌పైన ఇంకా ప్రేమ తగ్గలేదంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్‌ను పార్లమెంట్‌లో జీరో చేశామని, ఆ పార్టీ కోసం టార్చ్‌లైట్ పెట్టి వెతకాలంటూ చురకలంటించారు.