CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil
క్యాన్సర్ బాధితుడు మహమ్మద్ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్ వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో.. తనను కలిసేందుకు మహమ్మద్ అదిల్ వచ్చాడు. కానీ ముఖ్యమంత్రిని కలవలేకపోయాడు. అయితే ఈ విషయం సీఎంకు తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడి, ఆదిల్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అదిల్‌కు మరింత సాయం అందిస్తామని వారికి ధైర్యం ఇచ్చారు. అయితే మహమ్మద్ అదిల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న క్రమంలో ఇప్పటికే ఒకసారి జనవరి నెలలో ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ని సంబంధిత ఆసుపత్రికి ప్రభుత్వం అందించిందని సీఎం కార్యాలయం తెలిపింది.
ఎల్వోసీ మంజూరు
నెల రోజుల క్రితం ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి లక్ష రూపాయల ఎల్వోసీ మంజూరు చేశారు. ప్రస్తుతం ఆదిల్ అహ్మద్ ఆరోగ్య పరిస్థితి పై అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా కావాల్సిన మరింత సాయం అందిస్తామని ఆదిల్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.