Tuesday, July 23, 2024

Exclusive

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

  • దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు
  • టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం
  • చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు
  • ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక నడుం బిగించిన జీహెచ్ఎంసీ
  • చెరువుల దగ్గర పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు సన్నాహాలు
  • సీసీ కెమెరాలతో ఏర్పాటు చేయనున్న పహారా
  • ఇప్పటికే 6 చెరువులకు ఏర్పాటు చేసిన పహారా
  • రాబోయేవి బోనాలు, వినాయక చవితి, బతుకమ్మ, పండుగలు
  • సన్నాహక ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్న జీహెచ్ ఎంపీ

GHMC arrange surroundings of ponds and tanks cc cameras
నిత్యం హైదరాబాద్ వార్తలలో చెరువు కబ్జాలు సాధారణమైపోయాయి. ఒక్క హైదరాబాద్ నగరమే అనుకుంటే పొరపాటు తెలంగాణవ్యాప్తంగా పలు నగరాలలో ఇదే పరిస్థితి. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఎత్తుగా ఉండటంతో ఇక్కడ మొదటినుంచి వర్షాల మీదే ఆధారపడి జీవించేవారు. అుందుకే వర్షపు నీటిని ఒడిసిపట్టి ఇతరత్రా అవసరాలకు యోగ్యమయ్యేలా చెరువులను ముందు చూపుతో అప్పటి రాజులు, నవాబులు తవ్వించారని చరిత్ర చెబుతోంది. మరి అలాంటి చెరువులన్నీ ఏమైయ్యాయి. ఏటా సమృద్ధిగా వర్షాలు పడుతున్నా చెరువులు తగ్గిపోవడంతో నీటి నిల్వలు కూడా తగ్గిపోవడం ఆరంభం అయింది. దీనికంతటికీ కారణం చెరువుల కబ్జాలే కారణం.

చెరువులపై లెక్కలేవి?

టీ.సర్కార్ వెబ్ సైట్ ప్రకారం కేవలం 19 వేల 314 చెరువులకు సంబంధించిన సమాచారమే ఉంది. రాష్ట్రంలో కాకతీయుల కాలం నుంచి నిజాం రాజుల వరకు ఉన్న సుమారు లక్షన్నర చెరువులు తమ ఉనికిని కోల్పొయి, కాంక్రీట్‌ భవంతుల కింద మసకబారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చెరువులు కుంటలు కలిపి 46వేల 531 మాత్రమే ఉన్నాయి. 2015లో 46 వేల చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.22 వేల కోట్లు కేటాయించింది. మిషన్ కాకతీయ పథకం అమలు తీరు పక్కన పెడితే ప్రభుత్వం దగ్గర ఈ చెరువుల సమాచారం ఉండే అవకాశం ఉంది. ప్రతి చెరువుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి అంచనా వేయడానికి ఈ పట్టిక ఉంటే ఉపయోగపడుతుంది. 2021లో మీడియాలో వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీర్- ఇన్- చీఫ్, చీఫ్ ఇంజినీర్ల ప్రాదేశిక పరిధులలో ఉన్న 43,870 చెరువులలో 21,552 చెరువులు అలుగులు పారినాయి, 13,451 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం వరకు నింపడమైంది. ఈ చెరువుల సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు మనం భావించాలి. చెరువుల సంఖ్య ఎంత అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కచ్చితమైన లెక్కలు లేవు అనేది స్పష్టం.

నడుం బిగించిన జీహెచ్ఎంసీ

అన్యాక్రాంతమవుతున్న చెరువుల పరిరక్షణకు ఎట్టకేలకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణకు ఇప్పటికే ఈవీడీఎం జవాన్లతో పహారా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ చెరువుల పరిరక్షణతో పాటు ఇతర సేవలను కూడా పారదర్శకతతో అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా తొలుత 6 చెరువుల చుట్టూ ఏర్పాటు చేసిన మొత్తం 93 సీసీ కెమెరాల పహారా సరైన ఫలితాలిస్తుండటంతో మిగిలిన మొత్తం చెరువుల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. పైగా వచ్చేవి చెరువులతో ముడిపడిన ఫండుగలు. వాటిలో ప్రధానమైనవి బోనాలు, వినాయకచవితి, బతుకమ్మ పండుగలు. వీటిని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ ఎంసీ చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

సీసీ కెమెరాల ఏర్పాటు

ఒక్కో చెరువు చుట్టూ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫీటీఎల్) కవరయ్యేలా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. చెరువుల సైజును బట్టి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అతిపెద్ద చెరువుగా చెప్పుకునే దుర్గం చెరువు చుట్టూ ఏకంగా 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా చెరువు ఎంట్రెన్స్‌తో పాటు రాకపోకలు సాగించే వారితో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈవీడీఎం జవాన్ల పనితీరును కూడా ఈ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

 

 

 

 

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...