Tillu Squre Ott Release Date Locked To Stream On Netflix
Cinema

Tillu Square Movie: బాక్సాఫీస్‌ వద్ద టిల్లు స్క్వేర్ మానియా, ఆరవ రోజు కలెక్షన్స్‌ ఏకంగా..

Tollywood News Tillu Square Movie Heading Towards Into 100 Crore Club: టాలీవుడ్‌లో మార్చి 29న భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యన రిలీజ్ అయినా మూవీ టిల్లు స్క్వేర్. ఇప్పటివరకు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో రిలీజైన సిక్వెల్స్ అన్ని ఒక ఎత్తయితే.. సిద్ధు జొన్నలగడ్డ యాక్ట్ చేసిన డీజే టిల్లు సిక్వెల్ టిల్లు స్క్వేర్ ఒక ఎత్తు అనేలా..టిల్లు స్క్వేర్ మానియా కొనసాగుతోంది. ఈ మూవీ థియేటర్స్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఈ మూవీలోని ప్రతి సీన్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తూ ఉండడంతో మూవీ రిలీజ్ అయ్యి ఆరు రోజులు గడుస్తున్నా సరే, తన పవర్‌ని ఏం మాత్రం తగ్గించుకోకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సునామీని క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ సిక్వెల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి టీజర్ నుంచి థియేట్రికల్ రిలీజ్ వరకు ప్రతిదీ కూడా ఆడియెన్స్‌కు భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని నిలబెట్టుకుంది. పస్ట్‌ డే ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా 23.7 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ని సాధించి వావ్ అనిపిస్తోంది. ఇక ఈ మూవీ ఆరు రోజుల్లో ఎంత కలెక్షన్స్‌ను రాబట్టిందో మీకు తెలుసా..

టిల్లు స్క్వేర్ మూవీని వరల్డ్ వైడ్‌గా 800 థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 550 థియేటర్లలో టిల్లు స్వ్కేర్‌ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, వరల్డ్ వైడ్‌గా రూ. 27 కోట్ల వరకు ప్రీ మార్కెట్ జరిగింది. దీనితో టిల్లు స్క్వేర్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లకు ఫిక్స్ అయింది. ఇక మొదటి రోజు 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.. రెండవ రోజూ కూడా టిల్లు స్క్వేర్ రూ.20 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇక నాలుగవ రోజు వరకు టిల్లు స్క్వేర్ సినిమా రూ. 78 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి రూ.100 కోట్ల క్లబ్‌లో పరుగులు తీసే దిశగా ఉందని అందరు భావించే లోపు.. ఈ మూవీ ఆరవ రోజు రూ.91 కోట్లను సాధించి అట్లుంటది టిల్లు గానితోని అని ప్రూవ్ చేసుకుంది. రాబోయేది సమ్మర్‌ హాలీడేస్‌ కాబట్టి.. పైగా మధ్యలో ఇంకా ఏ మూవీలు కూడా ఇప్పుడప్పుడే రిలీజ్‌కు రెడీగా లేవు కాబట్టి.. టిల్లు స్క్వేర్ హవా ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుండడం ఖాయమనిపిస్తోంది.

Also Read: దేవర మూవీపై విశ్వక్‌సేన్‌ వైరల్ పోస్ట్

కాగా, డీజే టిల్లు మూవీకి , టిల్లు స్క్వేర్ మూవీకి డైరెక్టర్ మారినా కూడా.. టిల్లు పేరుకున్న బ్రాండ్‌ను ఎక్కడా తగ్గకుండా.. రెట్టింపు ఎనర్జీతో అదే కోవలో ఈ సినిమాను మళ్లీ రూపొందించడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. ఇక ఈ మూవీలో కుర్రాళ్ల ఆల్ టైమ్ క్రష్ అనుపమ, సిద్ధుకు జోడిగా నటించడంతో టిల్లు స్క్వేర్ కు ఇంకాస్త క్రేజ్ పెరిగింది. వీరితో పాటు నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ మెయిన్‌ రోల్స్‌ పోషించారు. ఇక మూవీ రిలీజ్‌ తర్వాత జరిగిన సక్సెస్ మీట్‌లో ఈ మూవీ మూడవ పార్ట్ కూడా ఉంటుందని అనౌన్స్ చేయడంతో.. ఇప్పటి నుంచే ఆ మూవీ ఎలా ఉండనుందో అనే క్యూరియాసిటీ అందరిలో పెరిగింది. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌ కూడా త్వరలోనే ఇస్తామని చెప్పుకొచ్చారు ఈ మూవీ మేకర్స్. మరి.. ఈ మూవీ రానున్న కాలంలో మరెన్నీ వండర్స్‌ని క్రియేట్ చేయనుందోనని అందరూ భావిస్తున్నారు.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?