Tollywood Hero Vishwak sen Interesting Post On Devara Music: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవర మూవీ ఒకటి. డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో రాబోతున్న పుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా అనుహ్యంగా వాయిదా పడింది. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ మూవీపై ఆడియెన్స్‌లో మరింత హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇందులో తారక్ జోడిగా అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, బీటౌన్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు హీరో విశ్వక్ సేన్. తారక్‌ను హగ్ చేసుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ దేవర మ్యూజిక్ అప్డేట్ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఆల్‌వేస్ లవ్ యూ ఎన్టీఆర్ అన్నా.. దేవర మ్యూజిక్ ఉందమ్మా నెక్ట్ లెవల్. ఇక ఈ ఆల్బమ్ అందరినీ సాంగ్స్‌తో చంపేస్తుందంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
Read Also: సుధీర్ న్యూ సర్కార్, ఫ్యాన్స్‌కి ఇక పండగంతే..!
ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి అనిరుధ్ మ్యూజిక్ అంటే మ్యాజిక్ చేసే ఉంటాడని అందరూ భావిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ దగ్గరి నుంచి దళపతి విజయ్, షారుఖ్ ఖాన్ వరకు దాదాపు స్టార్ హీరోలందరికి అద్భుతమైన మ్యూజిక్‌ని అందించాడు అనిరుధ్. ఇక అదే తరహాలో దేవర మూవీకి అద్భుతమైన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరు. ఇక విశ్వక్ చేసిన పోస్టుతో దేవర మ్యూజిక్‌పై ఫ్యాన్స్‌లో మరింత హైప్‌ని పెంచింది. ఖచ్చితంగా తారక్, కొరటాల మూవీకి బీజీ, మ్యూజిక్ వేరే లెవల్ ఉంటుందని అంటున్నారు.