Tamil Actor Daniel Balaji Dies Of Cardiac Arrest In Chennai
Cinema

Tamil Actor Daniel : నటుడు డేనియల్ హఠాన్మరణం, శోకసంద్రంలో ఇండస్ట్రీ

Tamil Actor Daniel Balaji Dies Of Cardiac Arrest In Chennai: తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన నటుడు డేనియల్ బాలాజీ శుక్రవారం అర్ధరాత్రి చెన్నైలో హఠాత్తుగా కన్నుమూశారు. 48 ఏళ్ల బాలాజీ తమిళ సినిమాలతో పాటుగా ఎన్టీఆర్ నటించిన సాంబ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలలో నటించి తన నటనతో టాలీవుడ్ ఆడియెన్స్‌ని అలరించాడు.

డేనియల్ బాలాజీ గతకొన్నేళ్లుగా చెన్నైలో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే అతన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌కు తరలించే లోపే గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తన హఠాన్మరణంతో తమిళ చిత్రపరిశ్రమలో విశాదం నెలకొంది.

Read Also: ఇచ్చి పడేశిన డిజే టిల్లు సీక్వెల్‌

డేనియల్‌ టాలీవుడ్‌లో సాంబ, చిరుత, టక్ జగదీష్‌తో పాటు చాలా సినిమాల్లో నటించాడు. బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో సుమారు 50కి పైగా సినిమాలు చేశారు. బాలాజీ ఎక్కువగా విలన్‌ పాత్రలే పోశించారు. చిట్టి అనే తమిళ సీరియల్‌తో తన నటనకి శ్రీకారం చుట్టారు. అదే సీరియల్‌ తెలుగులో పిన్ని పేరుతో స్ట్రీమింగ్ అయింది. అంతేకాకుండా తెలుగు ఆడియెన్స్‌ని ఆ సీరియల్ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ మూవీస్‌లో చిన్న చిన్న రోల్స్ చేసి అందరిని ఎంతగానో అలరించారు.

లోకనాయకుడు కమల్‌హాసన్, గౌతమ్‌మీనన్ కాంబోలో వచ్చిన వెట్టయ్యాడు విలయాడులో సైకో క్యారెక్టర్‌తో తన విలనిజంతో ఆడియెన్స్‌ని భయపెట్టాడు. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.ఈ మూవీ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో పొల్లవదన్, జ్ఞానకిరుక్కన్,అచ్చం యెన్‌బదు మదమైయదా, బిగిల్‌తో పాటు చాలా సినిమాల్లో ప్రతినాయకుడి రోల్ పోషించాడు. అలాగే కొన్ని సినిమాలలో పోలీస్ రోల్స్ కూడా పోషించాడు. చివరగా గత ఏడాది అరియవాన్ అనే తమిళ సినిమాలో కనిపించాడు.

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం