Tollywood Movie Tillu Square Review : ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీలో చూసిన సరే సీక్వెన్స్ లేకుండా సినిమాలు ఉండడం లేదు.చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు మూవీ మేకర్స్.అయితే ఆ సీక్వెల్‌లో కొన్నే హిట్ అవుతున్నాయి.ఆ లిస్ట్‌లో 2022లో వచ్చిన డీజే టిల్లు. ఈ మూవీ టాలీవుడ్‌లో రిలీజై ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ మూవీలో హీరో సిద్దు జొన్నలగడ్డ, నటి నేహశెట్టి జంటగా నటించగా, విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుని మంచి కలెక్షన్లను రాబట్టింది. అంతేకాకుండా హీరో సిద్దును కాస్త డీజే టిల్లుగా,నేహా శెట్టి పేరు పూర్తిగా రాధికాగా మార్చేసింది.ఇక దాదాపు రెండేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తెరకెక్కింది. కాకపోతే ఈసారి ఈ సినిమాకు డైరెక్టర్, హీరోయిన్ మారారు.విమల్ కృష్ణ ప్లేస్‌లో మల్లిక్ రామ్, నేహా ప్లేస్‌లో అనుపమ వచ్చి చేరారు.ఇప్పటివరకు అనుపమ ఇలాంటి గ్లామర్ రోల్ ఎప్పుడు చేయలేదు.దీంతో అనుపమనే ఈ సినిమాకు మైనస్ అవుతుంది అనుకున్నారు.కానీ సినిమా చూసాక ఆమె ఫ్లస్ అయింది. అంతేకాకుండా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.
ఇక మూవీ విషయానికొస్తే డీజే టిల్లు చివర్లో టిల్లు రాధికను జైల్లో కలిసి ఒక తెల్ల పిల్లతో వెళ్లిపోవడం చూపించారు.ఇక టిల్లు స్క్వేర్ అక్కడి నుంచే మొదలవుతుంది.రాధికా చేసిన మోసాన్ని మర్చిపోతూ టిల్లు తన మ్యూజిక్‌తో ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు.అలా ఒకసారి పబ్‌లో లిల్లీ కనిపిస్తుంది.రాధికా తరువాత ఏ అమ్మాయిని అంతగా చూడని టిల్లు లిల్లీని చూడగానే ఫిదా అయిపోతాడు.ఇక లిల్లీ కూడా టిల్లుకు పడిపోతుంది.అలా కలిసిన మొదటిరోజే వారు ఒక్కటవ్వుతారు.ఉదయమే లేచి చూసిన టిల్లుకు లిల్లీ కనిపించదు.వెతికి వెతికి అలసిపోయిన టిల్లుకు నెల తరువాత లిల్లీ ఒక హాస్పిటల్‌లో కనిపించి తాను ప్రెగ్నెంట్ అని చెప్తుంది.మొదటగా టిల్లు నమ్మకపోయినా తరువాత దానికి కారణం తనే అని లిల్లీని పెళ్లి చేసుకుంటాను అంటాడు.ఇక రెండు కుటుంబాలు కూడా ఈ పెళ్ళికి అంగీకరించి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న టైంలో టిల్లు పుట్టినరోజు వస్తుంది.ఆరోజు లిల్లీ టిల్లుకు షాక్‌ల మీద షాకులు ఇస్తుంది.మరోసారి టిల్లు అమ్మాయి చేతిలో మోసపోయాడని తెలుసుకుంటాడు.అసలు లిల్లీ ఎవరు.? ఎందుకు తన జీవితంతో ఆడుకుంది.? లిల్లీకి, మాఫియాకు ఉన్న సంబంధం ఏంటి.? మధ్యలో రాధికా ఎందుకు వచ్చింది.? అనేది సినిమా స్టోరీ.
Read Also : బిగ్‌బాస్ 17 విన్నర్ అరెస్ట్
ఇక స్టోరీ విషయానికి వస్తే సినిమా మొత్తం సిద్దు తన మార్క్ పంచ్‌లతో అదరగొట్టేశాడు.థియేటర్‌లో ఉన్నంతసేపు నవ్వకుండా ఉండలేరు.ముఖ్యంగా అనుపమ అందం మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి.ట్రైలర్ లో అనుపమను చూసి కేవలం గ్లామర్ కు మాత్రమే పనికివస్తుందనుకున్నారు అందరూ.కానీ, మూవీ మొత్తం లిల్లీ పాత్ర మీదనే నడుస్తోంది.ఎక్కడా లాగ్ డైలాగ్‌లు లేకపోవడం ఈ మూవీకి ప్లస్ అని చెప్పుకోవాలి.ఇక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో పర్ఫెక్ట్ సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ను తీర్చిదిద్దారు.ఇక ఈ మూవీలోని నటీనటుల విషయానికొస్తే టిల్లు అంటే సిద్దు సిద్దు అంటే టిల్లు అని చెప్పొచ్చు.ఆ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే.అమాయకంగా ఉంటూనే ప్రమాదం వచ్చిన ప్రతిసారి ఏదో విధంగా తప్పించుకోవడానికి తెలివేని వాడే పాత్రలో సిద్దు జీవించేసాడు.ఇక లిల్లీగా అనుపమ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్.చాలాకాలం తరువాత అనుపమ అటు గ్లామర్‌ను,ఇటు యాక్టింగ్‌ను బ్యాలెన్స్ చేసింది.
ఇక టిల్లు తండ్రిగా చేసిన మురళీధర్ మంచి మార్కులు కొట్టేశాడు.డీజే టిల్లులో కూడా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.దాన్నే సీక్వెల్‌లో కంటిన్యూ చేశారు.ఇక అతిధి పాత్రలో మెరిసిన రాధికా హైలైట్ అని చెప్పాలి.ఆమె ఎంట్రీకి స్పెషల్ సాంగ్ ఇక రాధికను చూడగానే థియేటర్‌లో ఆడియెన్స్ కేరింతలు.ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. ఈ మూవీకి మరో హైలైట్ అని చెప్పాలి.రామ్ మిరియాల,అచ్చు రాజమణి ఇచ్చి పడేశారు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.ఓవరాల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే.. సిద్దు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.డీజే టిల్లుకు పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు.ఎలాంటి లాజిక్స్ ఆశించకుండా వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే టిల్లు స్క్వేర్ పర్ఫెక్ట్ ఛాయిస్. మరెందుకు లేట్ మీరు కూడా చూడాలనుకుంటే లేట్ చేయకుండా థియేటర్‌లోకి చూడండి.