SS Rajamouli And Wife Rama Put On Their Dancing Shows
Cinema

SS Rajamouli : డ్యాన్స్‌ ఇరగదీసిన రాజమౌళి, వైరల్‌ అవుతున్న వీడియో

SS Rajamouli And Wife Rama Put On Their Dancing Shows: టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శక ధీరుడు, అందరూ జక్కన్నగా పిలుచుకునే డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజ‌మౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత ఒక్క రాజమౌళికే దక్కుతుంది. అయితే ఎప్పుడు కూడా తన సినిమాలతో బిజీ బిజీగా గడిపే జక్కన్నలో మరో కోణం కూడా ఉందని తాజాగా నిరూపితం అయింది. ఇటీవలే జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో స్టేజీపై స్టెప్పులేసి అందరినీ షాక్‌కి గురిచేశాడు. అది కూడా తన భార్య రమా రాజమౌళితో కలిసి చేతులు పట్టుకొని స్టేజ్‌పై సందడి చేస్తూ అందరిని ఎంటర్‌టైన్ చేశారు.

గ్రేట్‌ డ్యాన్సర్ ఇండియన్ మైఖేల్ జాక్సన్‌ ప్రభుదేవా యాక్ట్ చేసిన ‘ప్రేమికుడు’సినిమాలోని ఏఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన ‘అందమైన ప్రేమ‌రాణి..’అంటూ సాగే ఈ హిట్‌ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు ఇద్దరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఈ డ్యాన్స్ వీడియో సినీ ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. జక్కన్న డ్యాన్స్‌ చేసిన వీడియో చూసిన నెటిజన్లు, సినీ లవర్స్‌ ‘మీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?’ అంటూ షాకవుతూ కామెంట్లతో రాజమౌళిని అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Read More: టిల్లుగాడి మానియానా మజాకా, రెండో రోజు ఎన్ని కోట్లంటే..?

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని, చవిచూడని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ రాజమౌళి.. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి హిట్ సినిమాల తరువాత సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు యాక్ట్‌ చేస్తున్న SSMB29 తో బిజీగా మారాడు రాజమౌళి. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. రాజమౌళి ప్రతి సినిమాకు తన భార్య రమానే కాస్ట్యూమ్ డిజైనర్‌ అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్నడూ లేని విధంగా జక్కన్న ఇలా డ్యాన్స్‌ చేయడంపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జక్కన్న ఇలా డ్యాన్స్‌ చేశాడంటే.. SSMB29 మూవీ కూడా మరో బిగ్గెస్ట్ హిట్‌ నిలవనుందా అంటూ అందుకే జక్కన్న ఇలా డ్యాన్స్ చేస్తున్నాడని అందరూ భావిస్తున్నారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?